AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కట్టడిపై అధికారుల ఫోకస్

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు ప్రారంభమయ్యాయ్. గతంలో అంతా మాన్యువల్‌గా నడిచిన వ్యవస్థను కొన్నాళ్ల క్రితం ఆటోమేషన్‌లోకి తీసుకొచ్చారు. ఆ ఆటోమేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తడంతో ఇప్పుడు మరో అధ్యయనం మొదలైంది. మరోవైపు డ్రోన్లు, హైరైజ్ కెమెరాలనూ వాడాలని డిసైడయ్యారు. అసలు హైదరాబాద్‌లో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏంటి...? సమస్యలు ఎలా ఉన్నాయి...? పబ్లిక్‌లో అసహనం ఎంత.. దాన్ని ఎలా మార్చబోతున్నారు...? 

Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కట్టడిపై అధికారుల ఫోకస్
Hyderabad Traffic
Ram Naramaneni
|

Updated on: Jun 20, 2025 | 9:47 PM

Share

భాగ్యనగరంలో ట్రాఫిక్‌ కష్టాలు అన్నీఇన్నీ కావు…! ప్రస్తుతం హైదరాబాద్‌లో నాలుగు రకాల సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. అందులో మొదటిది మాన్యువల్ నుంచి ఆటోమేషన్‌కి సిగ్నలింగ్ వ్యవస్థ మారడం. డిపార్ట్‌మెంట్‌లో మ్యాన్‌ పవర్‌ తక్కువగా ఉండటంతో ఈ ఆటోమేషన్‌కి మొగ్గుచూపారు. దీంతో రెడ్‌ అండ్‌ గ్రీన్‌ సిగ్నల్స్‌కి ఓ టైమ్‌ని సెట్‌ చేస్తే చాలు పని అయిపోయినట్లే. సెట్‌ చేసిన టైమ్‌ని పట్టి సిగ్నల్స్‌ పడుతుంటాయి. ఇక్కడ ట్రాఫిక్స్ పోలీసుల అవసరం లేదు. ఏవైపు నుంచి ఎంత ట్రాఫిక్‌ వస్తుందో… ఎటువైపు వాహనాలు ఎక్కువగా వెళ్తున్నాయో అనవసం. దీంతో వాహనదారులకు చిర్రెత్తుతోంది.

ఇక రెండో సమస్య… అడ్డగోలు సిగ్నలింగ్‌ డ్యూరేషన్‌. ఏ ట్రాఫిక్ దగ్గరైనా 180 నిమిషాలకు మించి రెడ్ సిగ్నల్ ఉండకూడదన్నది ఒక రూల్‌. ఆయితే ఆ 180 సెకన్లు దాటిన తర్వాత గ్రీన్ లైట్ ఎంత సేపు ఉంటోందో తెలుసా.. కేవలం 30 సెకన్లు. కొన్నిచోట్ల అయితే 15, 20 సెకన్లు కూడా ఉంటోంది. ఫలితంగా రయ్యిన వెళ్లిపోవాల్సిన చోట కూడా 4 సిగ్నళ్ల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు రావడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

ఇక మూడోది యూటర్న్‌లు. చాలాచోట్ల సిగ్నల్స్‌ తీసేసి… కొద్ది దూరంలో U టర్న్‌లు ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారంగా పోలీసులకు కనిపించింది. అయితే ఒక్కోసారి కిలోమీటర్‌పైన వెళ్తే గానీ.. U టర్న్ ఉండకపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్‌లు తప్పడంలేదు. ఇది కొంత మేర సత్ఫలితాన్నిస్తున్నా… ఎక్కడ యూ టర్న్‌లు అప్లై చేయాలో, ఎక్కడ చేయకూడదో పూర్తి అధ్యయనం జరగకపోవడం ఇబ్బందిపెడుతోంది. ఇక నాలుగోది ఫుట్‌పాత్‌ల ఆక్రమణ. వీటి వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే రోప్ అనే వ్యవస్థ ద్వారా ఆ ఆక్రమణలను విజయవంతంగా తొలగించించారు. ఫలితంగా 18 కిలోమీటర్ల వేగం ఇప్పుడు 26కి పెరిగింది. అయినా అక్కడక్కడా ఇబ్బందులు తలెత్తూనే ఉన్నాయి.

ఇకీ నాలుగు సమస్యలపై అద్యయనం చేసిన అధికారులు… ఓ రెండు సొల్యూషన్స్‌పై వర్కౌట్‌ చేస్తున్నారు. అందులో ఒకటి.. డ్రోన్ కెమెరాలు వాడడం. వీటిల్లో ఒకటి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. మరొకటి ఐటీ కారిడార్‌లో వాడబోతున్నారు. ఇంకొకటి కంట్రోల్‌ రూమ్‌లో అందుబాటులో ఉంటుంది. సో ఈ డ్రోన్లు ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తారు. ఇక రెండో ప్రయత్నం… ముఖ్యమైన కూడళ్లలో భారీ భవంతులపై హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడం. 360డిగ్రీస్‌లో తిరుగుతూ లాంగ్ డిస్టెన్స్‌ను కూడా కవర్ చేస్తూ ట్రాఫిక్‌ దృశ్యాల్ని చూపిస్తుంటాయి హైరైజ్‌ కెమెరాలు. దీంతో అప్పటికప్పుడు ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఇదే విషయాన్ని చెప్పారు నగర సీపీ సీవీ ఆనంద్. ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. త్వరలోనే మంచి రిజల్ట్స్‌ చూస్తారన్నారు. మొత్తంగా… అధికారులు వర్కౌట్ చేస్తున్న కొత్త పద్దతులు ఎలాంటి రిజల్ట్స్‌ ఇస్తాయన్నది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..