భద్రతతో నాంపల్లి ఎగ్జిబిషన్.. ఈరోజే స్టార్ట్

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇవాళ్టి నుంచి ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. దీంతో.. భద్రతా ఏర్పాట్లపై అధికారులు ఇచ్చిన వివరణ, నివేదికలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత ఏడాది జరిగిన అగ్నిప్రమాదం, ప్రజల భద్రత ప్రమాణాల నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దంటూ లాయర్‌ ఖాజా ఐజాజుద్దీన్‌ కోర్టులో పిటిషన్‌ వేయగా.. పటిష్టమైన ఏర్పాట్ల మీద హైకోర్టు వివరణ కోరింది. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. తప్పించుకునేందుకు ఏర్పాటుచేసిన 9 గేట్లలో 3 […]

భద్రతతో నాంపల్లి ఎగ్జిబిషన్.. ఈరోజే స్టార్ట్
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2020 | 1:02 PM

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. ఇవాళ్టి నుంచి ఎగ్జిబిషన్‌ ప్రారంభం కానుంది. దీంతో.. భద్రతా ఏర్పాట్లపై అధికారులు ఇచ్చిన వివరణ, నివేదికలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గత ఏడాది జరిగిన అగ్నిప్రమాదం, ప్రజల భద్రత ప్రమాణాల నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వొద్దంటూ లాయర్‌ ఖాజా ఐజాజుద్దీన్‌ కోర్టులో పిటిషన్‌ వేయగా.. పటిష్టమైన ఏర్పాట్ల మీద హైకోర్టు వివరణ కోరింది. అనుకోని ప్రమాదం సంభవిస్తే.. తప్పించుకునేందుకు ఏర్పాటుచేసిన 9 గేట్లలో 3 గేట్లు తెరిచే ఉంచాలని స్పష్టం చేసింది.

కాగా.. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర నివేదికలను సమర్పించారు. అయితే నుమాయిష్‌లో 1500 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎగ్జిబిషన్‌ సొసైటీ చెబుతుండగా.. అధికారిక వెబ్‌సైట్‌లో 2900 స్టాళ్లు ఉన్నాయని పిటిషనర్‌ చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఎన్ని స్టాళ్లు ఏర్పాటుచేశారు? ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు ఏంటి? తదితర వివరాలతో జనవరి 6 లోగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఎన్‌వోసీలను ఇవ్వడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. నూమాయిష్‌కు సంబంధించిన మ్యాప్‌, వాహనాల పార్కింగ్‌ కోసం ఆయా కార్యాలయాల అధిపతుల నుంచి ఇచ్చిన ఎన్‌వోసీలను ధర్మాసనానికి సమర్పించగా.. కోర్టు ప్రాథమికంగా సంతృప్తి వ్యక్తం చేసింది. నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతీ ఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు.. గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వం 3 కోట్లను వెచ్చించింది.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..