AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాయత్రి కథ సుఖాంతం..అసలేం జరిగిందంటే..!

హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌లో యువతి మిస్సింగ్‌ కేసు కథ సుఖాంతమైంది. దుండిగల్‌ మున్సిపాలిటీ మల్లంపేటకు చెందిన గాయత్రి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూపర్ మార్కెట్‌కి వెళ్లి వస్తానని చెప్పిన అమ్మాయి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యువతి కోసం గాలింపు చేపట్టారు. దుండిగల్‌ పోలీసులు తక్కువ సమయంలోనే గాయత్రి ఆచూకీని గుర్తించారు. కేపీహెచ్ బీలోని సర్దార్ పటేల్ నగర్ […]

గాయత్రి కథ సుఖాంతం..అసలేం జరిగిందంటే..!
Pardhasaradhi Peri
|

Updated on: Dec 20, 2019 | 5:50 PM

Share

హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌లో యువతి మిస్సింగ్‌ కేసు కథ సుఖాంతమైంది. దుండిగల్‌ మున్సిపాలిటీ మల్లంపేటకు చెందిన గాయత్రి బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సూపర్ మార్కెట్‌కి వెళ్లి వస్తానని చెప్పిన అమ్మాయి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యువతి కోసం గాలింపు చేపట్టారు. దుండిగల్‌ పోలీసులు తక్కువ సమయంలోనే గాయత్రి ఆచూకీని గుర్తించారు. కేపీహెచ్ బీలోని సర్దార్ పటేల్ నగర్ లో గాయత్రిని గుర్తించిన పోలీసులు సురక్షితంగా దుండిగల్ పీఎస్ కు తీసుకొచ్చారు.

గాయత్రి స్థానికంగా ఉన్న రత్నదీప్‌ మార్కెట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంది. రోజూలాగే,..బుధవారం మధ్యాహ్నం కూడా ఉద్యోగానికని వెళ్లి..రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాయత్రికి ఫోన్‌ చేయగా..స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. వెంటనే యువతి పనిచేస్తున్న స్టోర్‌కు ఫోన్‌చేయగా అసలు గాయత్రీ విధులకు హాజరుకాలేదని తెలిసింది. దీంతో తల్లిదండ్రులు గురువారం దుండిగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే తనకు ఇంటిలో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతో ఇంటి నుంచి తన స్నేహితుల ఇంటికి వెళ్లానని గాయత్రి పోలీసులకు వివరించింది.. ఇదే విషయాన్ని తాను ఇంటిలో ఒక లేఖను కూడా ఉంచినట్టు పేర్కొంది..  తనని వెతకొద్దంటూ ఇంట్లో వాళ్లకి లెటర్ రాసిన గాయత్రి  పోలీసులకు సైతం ఫిర్యాదు చేయొద్దంటూ లేఖలో పేర్కొంది. గాయత్రి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు.. తనకు బలవంతం వివాహం చేసేందుకు ప్రయత్నించడంతోనే తాను బయటకు వచ్చేశానని గాయత్రి పోలీసులకు స్పష్టం చేసింది.. దీంతో గాయత్రి తల్లిదండ్రులను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.. బలవంతంగా వివాహం చేయవద్దని సూచించారు.. అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లడం తగదని, ఏదైన సమస్య వస్తే తమ దృష్టికి తీసుకురావాలని గాయత్రికి పోలీసుల సూచించారు. మొత్తానికి యువతి సురక్షితంగా ఇంటికి చేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..