Nampally Numaish: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభం
హైదరాబాద్ లోని చారిత్రాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటలకు

Hyderabad industrial Exhibition: హైదరాబాద్ లోని చారిత్రాత్మక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మినీ నుమాయిష్ ప్రారంభమైంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటలకు 300 స్టాల్స్ తెరిచి ఉండనున్నాయి. నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. 25. ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మినీ నుమాయిష్ 20 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది.
కాగా, నాంపల్లి నుమాయిష్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రతి ఒక్కరిని డిజిటల్ థర్మామీటర్‌తో పరీక్షించి లోపలికి పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక లోపల జనాలు ఫ్రీగా నడిచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మాస్కు ధరించని వారిని నుమాయిష్‌కు అనుమతించమని స్పష్టం చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని సందర్శకులు ప్రదర్శనను ఆరోగ్యకరంగా ఆస్వాదించాలని విన్నవిస్తున్నారు.
Read also: Motkupalli: టీఆర్ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు చేరికకు ముహూర్తం ఖరారు