Motkupalli: టీఆర్ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు.. చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
టీఆర్ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు చేరికకు ముహూర్తం ఖరారైంది .ఈ నెల 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా
Motkupalli Narsimhulu: టీఆర్ఎస్ పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులు చేరికకు ముహూర్తం ఖరారైంది .ఈ నెల 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షం లో గులాబీ కండువా కప్పుకోనున్నారు మోత్కుపల్లి. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీలో మోత్కుపల్లి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు మోత్కుపల్లి. ఇక ఇప్పుడు నేరుగా గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని రాజకీయ నేతల్లో సీనియర్. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పథకం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్‌గా కీర్తించారు. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. మోత్కుపల్లి చేసిన ఈ కామెంట్స్.. ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని చెప్పకనే చెప్పాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం దళిత నినాదం తెరపైకి రావడంతో, మోత్కుపల్లికి కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి. అదే సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరితే, సీఎం కేసీఆర్ ఆయనకు కీలక పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లిని చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారనే టాక్ నడుస్తోంది.
Read also: Sasikala: జయలలిత సమాధి వద్ద శశికళ భావోద్వేగం.. అమ్మను తలచుకుంటూ కంట తడిపెట్టిన చిన్నమ్మ