Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైలు వేళలు పొడిగింపు

|

Oct 07, 2022 | 5:54 PM

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ విపరీతంగా ఉండే నగరంలో మెట్రో సేవలు..

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. రైలు వేళలు పొడిగింపు
Hyderabad Metro Rail
Follow us on

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్‌ విపరీతంగా ఉండే నగరంలో మెట్రో సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే రైలు సమయ వేళల్లో కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో. రైలు వేళలు రాత్రి పూట 11 గంటల వరకు పొడిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ సమయ వేళలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఉదయం పూట ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 10.15 గంట‌ల వ‌ర‌కే ట‌ర్మిన‌ల్ స్టేష‌న్ల నుంచి చివ‌రి మెట్రో రైలు ఉండగా, దీనిని దీన్ని 11 గంట‌ల వ‌ర‌కు పొడిగించారు. అయితే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయ వేళలను పెంచినట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్‌ నగర మెట్రో రైలు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఎంతో మంది మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలంటే చాలా మంది ప్రయాణికులు మెట్రో రైలులు ఆశ్రయిస్తున్నారు. అందుకు తగినట్లుగానే మెట్రో సంస్థ కూడా మరిన్ని సదుపాయాలను కల్పిస్తోంది. పండగలు, ఇతర ప్రత్యేకమైన సమయాల్లో మెట్రో రైళ్లను పెంచుతోంది మెట్రో సంస్థ. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మరిన్ని మెట్రో రైళ్లను పెంచుతూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా చివరి మెట్రో రైలు సమయాన్ని పొడిగించడంతో ప్రయాణికులకు మరింతగా ఉపయోగం ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి