AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. రోజుకు 4 లక్షలకు పైగానే.. సర్వీసులు పెంచాలని డిమాండ్‌

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైళ్లు దూసుకెళ్తోన్నాయి. మెట్రో సేవలతో ప్రయాణికులు తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు..

Hyderabad Metro: దూసుకెళ్తున్న హైదరాబాద్ మెట్రో.. రోజుకు 4 లక్షలకు పైగానే.. సర్వీసులు పెంచాలని డిమాండ్‌
Hyderabad Metro
Shaik Madar Saheb
|

Updated on: Oct 20, 2022 | 11:22 AM

Share

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైళ్లు దూసుకెళ్తోన్నాయి. మెట్రో సేవలతో ప్రయాణికులు తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు.. వేగవంతమైన మెట్రో ప్రయాణినికే ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీని పెంచాలని హైదరాబాద్ మెట్రో తీసుకున్న పలు నిర్ణయాలతో క్రమంగా రద్దీ సైతం పెరుగుతోంది. వీక్ డేస్ లో 4లక్షల మందికిపై ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. వారంతపు రోజుల్లో మెట్రో సర్వీసులను ఉపయోగించుకునే వారి సంఖ్య నాలుగు లక్షలు దాటినట్లు మెట్రో వెల్లడించింది. కరోనావైరస్ కు ముందు ఉన్న ప్రయాణికుల రద్దీ తాజాగా నమోదవుతోంది. దీంతో మెట్రో సర్వీసులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా మెట్రో సర్వీసులను పెంచాలని ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో అధికారులను కోరుతున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో.. హైదరాబాద్ మెట్రో కూడా ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటోంది. వీకెండ్ రోజుల్లో స్పెషల్ ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

అంతకుముందు మెట్రో సేవలు 10.30 వరకే ఉండగా.. ఇటీవలనే రైలు వేళలను రాత్రి పూట 11 గంటల వరకు పొడిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ప్రకటించారు. ఉదయం పూట ఎప్పటిలాగే 6 గంటలకు మెట్రో రైలు ప్రారంభమై.. 11 గంట‌ల వ‌ర‌కు సేవలందిస్తోంది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయ వేళలను పెంచారు. అయితే.. తాజాగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని.. రైలు సర్వీసులను కూడా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కాగా.. వీకెండ్ రోజుల్లో 59 రూపాయాల టికెట్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది ఉగాది నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్‌ వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంది. 59 రూపాయలతో మూడు కారిడార్లలో ఎక్కడి నుండి ఎక్కడికైనా అన్ లిమిటెడ్ గా ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో చాలామంది ప్రయాణికులు వీకెండ్‌ రోజుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..