Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్.. తీరం దాటేది ఎక్కడంటే..?

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయిన జనాన్ని సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Cyclone Sitrang: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న సిత్రాంగ్‌ తుఫాన్.. తీరం దాటేది ఎక్కడంటే..?
Cyclone Sitrang
Follow us

|

Updated on: Oct 20, 2022 | 9:21 AM

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో బెంబేలెత్తిపోయిన జనాన్ని సిత్రాంగ్‌ తుఫాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అక్టోబర్ 22 కి వాయుగుండంగా మారనుంది. సిత్రాంగ్‌ తుఫాన్ ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణల పై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురువనున్నాయి. సముద్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్టోబర్ 21, 22 తేదీల్లో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

దీంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య తీరందాటుందన్న ముందస్తు సంకేతాలతో తీరప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. సిత్రాంగ్‌ తుపాను ఎటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అక్టోబర్ 25వ తేదీ నాటికి సిత్రాంగ్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్‌ ఫోర్‌కాస్ట్‌ సిస్టమ్‌ జీఎఫ్‌ఎస్‌ ముందస్తు సమాచారం ప్రసారం విడుదల చేసింది. యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ సంస్థ సిత్రాంగ్‌ తుఫాను బాలాసోర్‌ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, ఒడిశా, తెలంగాణ, బెంగాల్‌లలో 26, 27 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అయితే.. తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. 22న మరిన్ని వివరాలు తెలుస్తాయిని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Latest Articles
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
అడవుల్లో మండుతున్న మంటలు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
ఇది పడకగదినా లేక టాయిలెట్ నా! ఫ్లాట్ వింత నిర్మాణం చూస్తే షాక్
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
దేశంలో అందరిచూపు ఆ 8 నియోజకవర్గాలపైనే.. అన్నీ యూపీలోనే
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
తెలంగాణకు క్యూ కట్టిన బీజేపీ అగ్రనేతలు.. ప్రచారంలో దూకుడు..
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
ఎకానాలో రికార్డులను ఏకిపారేసిన కోల్‌కతా ఆల్ రౌండర్.. కట్‌చేస్తే
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
రజనీకాంత్ కి షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.!
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
పిచ్చి పరాకాష్టకు చేరింది..! వెరైటీ కోసం ప్రాణాలు రిస్క్‌లోపెట్టి
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
గోర్లు కొరికే అలవాటు ఉందా.. ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలుసా
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..
నేను లవ్ చేసిన అమ్మాయిలే నన్ను మోసం చేశారు..