AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో… బ్రాండ్‌ బాబులు!

కొత్త బ్రాండు, హైఎండు..కార్లు… బైకులు… నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్‌ కారు వచ్చినా.. బైక్‌ వచ్చినా బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్‌ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది. హై ఎండ్‌ కార్లు, బైక్‌ల […]

హైదరాబాద్‌లో... బ్రాండ్‌ బాబులు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 4:38 PM

Share

కొత్త బ్రాండు, హైఎండు..కార్లు… బైకులు… నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్‌ కారు వచ్చినా.. బైక్‌ వచ్చినా బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్‌ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

హై ఎండ్‌ కార్లు, బైక్‌ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్‌ బెంజ్‌కు చెందిన జీఎల్‌ఎస్‌ 350డీ 4 మాటిక్‌ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్‌ 5 ఎక్స్‌డ్రైవ్‌ 30డీ డీపీఈ విత్‌ ఎట్‌ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్‌ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ 69, వోల్వో ఎక్స్‌ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్‌ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి.

హైఎండ్‌ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్‌సన్‌ దూసుకుపోతోంది. హార్లీడేవిడ్‌సన్‌ ఎక్స్‌జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్‌సన్‌ ఎక్స్‌జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్‌కే మోటార్‌ వీల్స్‌ టీఎన్‌ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్‌ (జపాన్‌), ఇండియా కవాసకి మోటార్స్‌కు చెందిన నింజా 650 తదితర బైక్‌ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్‌ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్‌ బైక్‌లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్‌ డీలర్లు అభిప్రాయపడ్డారు. కాగా, 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ –6 మోడల్‌ మార్కెట్‌లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

Follow Us
జర జాగ్రత్త .. ఈ రాశుల వారికి గండం మొదలు.. ఏ పని చేసినా ప్రమాదమే!
జర జాగ్రత్త .. ఈ రాశుల వారికి గండం మొదలు.. ఏ పని చేసినా ప్రమాదమే!
పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి..
పుట్టిన వెంటనే దత్తత.. 12ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి..
బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. 4వసారి ఆసియా క్రీడలకు ఎంపిక
బాణంతో చరిత్ర రాస్తోన్న తెలుగు తేజం.. 4వసారి ఆసియా క్రీడలకు ఎంపిక
రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఘోరం!
రాత్రైనా ఇంటికి చేరుకోని ఆ ముగ్గురు పిల్లలు.. కాసేపటికే ఘోరం!
సూర్య 'వీరభధ్రుడు' సినిమాకు 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సూర్య 'వీరభధ్రుడు' సినిమాకు 3 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రామచిలుక - ఉడుతల పంచాయితీ.. ఇతరులపై ఫిర్యాదు చేయడం ఆపండి..!
రామచిలుక - ఉడుతల పంచాయితీ.. ఇతరులపై ఫిర్యాదు చేయడం ఆపండి..!
ఒక్క హీరోతో ఏకంగా 31 సినిమాల్లో ..
ఒక్క హీరోతో ఏకంగా 31 సినిమాల్లో ..
న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో...
న్యాయం దక్కక అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. పోలీసులు నిర్లక్ష్యంతో...
KBR నేషనల్ పార్క్ పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
KBR నేషనల్ పార్క్ పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
2 నెలలపాటు చక్కెర తినడం పూర్తిగా మానేస్తే.. ఏం జరుగుతుందో తెల్సా?
2 నెలలపాటు చక్కెర తినడం పూర్తిగా మానేస్తే.. ఏం జరుగుతుందో తెల్సా?