Sandeep Shandilya: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు ఛాతీనొప్పి.. చికిత్స అందిస్తున్న వైద్యులు

|

Nov 20, 2023 | 4:40 PM

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సందీప్ శాండిల్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ పాత సీపీ కార్యాలయంలో ఉండగా సందీప్‌ శాండిల్య ఛాతీనొప్పితో ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం కమిషనర్‌కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ శాండిల్య తనదైన పనితీరును కనపరుస్తున్నారు.

Sandeep Shandilya: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యకు ఛాతీనొప్పి.. చికిత్స అందిస్తున్న వైద్యులు
Hyderabad City Commissioner Sandeep Sandlya Is Treatment At Apollo Hospital Due To Chest Pain
Follow us on

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సందీప్ శాండిల్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌ పాత సీపీ కార్యాలయంలో ఉండగా సందీప్‌ శాండిల్య ఛాతీనొప్పితో ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందం కమిషనర్‌కు మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

ఈ మధ్యకాలంలోనే నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సందీప్ శాండిల్య తనదైన పనితీరును కనపరుస్తున్నారు. సిటిలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా, ఎన్నికల సమయంలో నిర్వర్తించాల్సిన విధులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పై అపోలో ఆసుపత్రి సిబ్బంది బులిటెన్‌ను విడుదల చేయాల్సి ఉంది. అయితే ప్రాధమికంగా అందిన సమాచారం ప్రకారం ఉన్నపళంగా ఛాతినొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..