AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఒక్క ఫేస్‌బుక్ రిక్వెస్ట్.. అతన్ని నిండా ముంచేసింది.. ఏం జరిగిందో తెలుస్తే!

ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో ఎక్కువగా చదువుకున్న వారు, వ్యాపారవేతలే డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈజీగా మనీ సంపాదించొచ్చని స్కామర్స్‌ చెప్పిన మాటలకు బోల్తాపడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేర్‌టో చోటుచేసుకుంది. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో మంచి రాబడి కల్పిస్తామని చెప్పి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.2.6కోట్లు కాజేశారు కేటుగాళ్లు.

Hyderabad: ఒక్క ఫేస్‌బుక్ రిక్వెస్ట్.. అతన్ని నిండా ముంచేసింది.. ఏం జరిగిందో తెలుస్తే!
Facebook Cyber Scam
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 19, 2025 | 3:28 PM

Share

వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని అమీర్‌పేటకు చెందిన 48 ఏళ్ల ఓ వ్యాపారవేత్తను సైబర్‌ మోసగాళ్లు ట్రాప్‌ చేవారు. గత ఫిబ్రవరి నెలలో మాధవి రెడ్డి అనే ఓ మహిళ పేరుతో ఆ వ్యాపార వేత్తకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్ వచ్చింది. దీంతో ఆ వ్యాపారవేత్త ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. ఆమె ఓ స్టాక్‌ మార్కెట్‌ కన్సల్టెంట్‌గా ఆ వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరి మధ్య వాట్సాప్‌లో సంభాషణ సాగింది. ఇక ప్లాన్‌ ప్రకారం ఆ వ్యాపారవేత్తకు మాయమాటలు చెప్పి.. ఒక ట్రేడింగ్ వెబ్ పోర్టల్‌లో పెట్టుబడి పెట్టేలా చేసింది. అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి అతనికి అనేక బ్యాంక్ ఖాతా నంబర్‌లను అందించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 మధ్య కాలంలో ఆ వ్యాపారవేత్త 26 సార్లు పెట్టుబడి పెట్టారు. ఒక్కోసారి రూ.4.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆ పోర్టల్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా పెట్టుబడి మొత్తం రూ.2.6 కోట్లకు చేరుకుంది.

అయితే ఇక బాధితుడి నమ్మకాన్ని పొందేందుకు మోసగాళ్ళు మార్చి 30న అతనికి ప్రాఫిట్ వచ్చినట్లుగా కొంత అమౌంట్‌ను అతని ఖాతాకు బదిలీ చేశారు. అతని ఆన్‌లైన్ ఖాతాలో కూడా అంతకంతకు లాభాలు పెరుగుతున్నట్లు చూపించారు. దీంతో ఆ వ్యాపారవేత్త తాను లాభాల ట్రాక్‌లోనే ఉన్నట్లు భావించాడు. అయితే ఖాతాలోని డబ్బును డ్రా చేసుకోవాలనుకున్న ఆ వ్యాపారవేత్తకు అది సాధ్యం కాలేదు. ఈ సమస్య గురించి వాళ్లకు తెలియజేస్తే..డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్‌ అంటూ.. అతన్ని తిరిగి డబ్బులు అడగడం ప్రారంభించారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త ఏప్రిల్ 17న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ….

మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
మారిన ట్రాఫిక్ రూల్స్.. వాహనదారుల్లారా బీకేర్‌ఫుల్..!
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్‌ సూసైడ్‌! ముగ్గురు మృతి
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
ఇలా శుభ్రం చేస్తే క్షణాల్లో మీ గ్యాస్ స్టౌ అద్దంలా మెరవాల్సిందే
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
Viral Video: మొసలి నోట్లో చేయి పెట్టాడు.. ఆ తర్వాత షాకింగ్ సీన్..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
ఆరెంజ్ పండ్లు వీరికి విషంతో సమానం.. తిన్నారో సమస్యలు..
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
వందే భారత్ రైళ్లు ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎంత మంది ఉద్యోగులు!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి!
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
దూబే కొత్త హెయిర్‌స్టైల్ చూసి ఆడుకుంటున్న నెటిజన్స్
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
రిపబ్లిక్ డే పరేడ్‌ విన్యాసాలను ప్రత్యక్షంగా ఇలా చూడండి..!
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా
ఆహారం తిన్న తర్వాత షుగర్ పెరిగిపోతుందా? మీ కోసం 10 రూపాయల చిట్కా