Lavanya: లావణ్య సంచలన నిర్ణయం.. న్యాయం చేయకపోతే వాళ్ల ముందే ప్రాణాలు తీసుకుంటా!
టాలీవుడ్‌లో హీరో రాజ్ తరుణ్-లావణ్య వివాదం రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయంపై నార్సింగి పీఎస్‌కు వెళ్లిన లావణ్య సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ప్రాణహాని ఉందన్న పోలీసులు పట్టించుకోవట్లేదని.. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటానన్నట్టు తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా సాగిన హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్‌పై పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటున్నట్లు లావణ్య చెప్పడంతో ఇక వివాదం ముగిసిందనుకుంటే.. తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఉంటున్న ఇంటివద్దకు వెళ్లడంతో మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఉంటున్న ఇంటి దగ్గరకు వెళ్తే ఆమె వాళ్లను రానివ్వకుండా బయటకు పంపేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. వాళ్లు మనుషులను తీసుకొచ్చి తనపై దాడి చేయించారని లావణ్య ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా తాజాగా లావణ్య మరోసారి నార్సింగి పీఎస్‌కు వచ్చింది. నిన్న రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తన కంప్లైంట్ తీసుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. మొన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని.. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని లావణ్య ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయట్లేదని వాపోయింది. పోలీసులు తనకు న్యాయం చేయలేకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదులుతానని లావణ్య అన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….
