AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అగ్ని ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. త్వరలో అందుబాటులోకి రెస్క్యూ రోబోస్‌!

ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీలు ఏవైనా తమకు పనికొస్తాయి అనుకుంటే ప్రభుత్వాలు వాటిని త్వరగా తమ రాష్ట్రాలకు తెప్పించుకోవాలని అనుకుంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఫైర్ ఫైటర్ రోబో కిట్లు కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఏవైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడేందుకు, ప్రమాద స్థాయిని నివారించేందుకు ఉపయోగపడుతుంది.

Hyderabad: అగ్ని ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నాలజీ.. త్వరలో అందుబాటులోకి రెస్క్యూ రోబోస్‌!
Fire Fighter Robo
Lakshmi Praneetha Perugu
| Edited By: Anand T|

Updated on: Apr 20, 2025 | 8:22 AM

Share

అగ్నిప్రమాదాలు నివారించేందుకు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ దూకుడు మీద పనిచేస్తుంది. ఈ క్రమంలోనే  ప్రమాద సమయాల్లో బాధితులను రక్షించేందుకు, ప్రమాద స్థాయిని నివారించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఫైర్ ఫైటర్ రోబో, కిట్లు కలిగిన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫైర్ ఫైటర్ రోబో బాధితులను రక్షించడంతో పాటు, ప్రమాద స్థాయిని నివారించేందుకు ఉపయోగపడుతాయి. ఏవైనా  అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ముందుండి పోరాడేది ఫైర్ ఫైటర్స్.. రెస్క్యూ చేస్తున్న సందర్భాల్లో వారు గాయాలపాలవడం, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం చూస్తుంటాం… అయితే ఈ ప్రమాదాల నుంచి ఫైర్ ఫైటర్స్ కి ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఫైర్ ఫైటర్ రోబోలను, అన్ని రకాల కిట్లు కలిగిన వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ కి అనుకున్న నిధులు కేటాయించడంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. సుమారు రూ.6కోట్ల నిధులతో ఫ్రాన్స్ నుండి ఫైర్ ఫైటర్ రోబోను వాహనాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇదే కాకుండా అత్యాధునిక టెక్నికల్ టూల్ కిట్స్ కలిగిన రెస్క్యూ టెండర్ వాహనాన్ని కూడా కొనుగోలు చేసింది. ఈ అదుతానత రెస్క్యూ కిట్లు కలిగిన ప్రమాద సమయాల్లో ప్రైర్‌ ఫైటర్స్‌కు ఇబ్బందులు లేకుండా నివారణ చర్యలు చేపట్టడానికి తోల్పడుతుంది

ఫ్రాన్స్‌కు చెందిన షార్క్ రోబోటిక్స్ సంస్థ ఈ ఫైటర్ రోబో (RHYNO PROTECT) మోడల్ ను అభివృద్ధి చేసింది. థర్మల్ ఇమేజింగ్, రిమోట్ ఆపరేషన్ సామర్థ్యాలతో కూడిన ఫైటర్ రోబో 900°C, 1000°C వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలకు. అంతే కాకుండా తీవ్రమైన పరిస్థితులను కూడా ఇది ఎదుర్కోగలదు. దీని దృఢమైన నిర్మాణం పేలుళ్లు, కూలిపోయే నిర్మాణాల వంటి ప్రదేశాల్లోకి వెళ్లి అక్కడ చిక్కకున్న వారిని రక్షించేందుకు వీలు కలిగిస్తుంది. ఇది నిమిషానికి 2వేల లీటర్ల నీటి మానిటర్‌ను అందిస్తుంది. ఇది ఫోమ్‌ను కూడా విడుదల చేయగలదు. ఈ ఫైర్ రోబో.. రెండు ఆన్‌బోర్డ్ కెమెరాలను కలిగి ఉంది. వాటిలో ఒకటి థర్మల్ రిమోట్ నావిగేషన్, ఇది అగ్ని హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి పనిచేస్తోంది.  ఈ రోబోట్ 500 కేజీల లోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అత్యవసర సమయాల్లో భారీ వస్తువులను తరలించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోబోట్‌లో అత్యాదునిక బ్యాటరీలు ఏర్పాడు చేయబడ్డాయి. ఇది డౌన్‌టైమ్ లేకుండా ఎక్కువ కాలం పాటు నిరంతరాయంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ రోబోట్ బ్యాటరీలను మార్చడం ద్వారా రోజుల తరబడి పనిచేయగలదు.

అయితే రెస్క్యూ టెండర్ వాహనం ఇవ్వాల్టి నుండి అందుబాటులో ఉండగా, ఈ ఫైర్ ఫైటర్ రోబో ఇంకా అందుబాటులోకి రాలేదు. దీన్ని త్వరలో  తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అందుబాటులోకి తీసుకురానుంది.  ఫైర్ ఫైటర్ రోబోకు సంబంధించిన ఆపరేటర్స్ ఇంకా పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోలేదు..ఈ రోబోట్‌ ఏలా ఆపరేట్‌ చేయాలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందాక దీన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఆలోచిస్తోంది. ఈ ఫైటర్ రోబో అందుబాటులోకి వస్తే ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చెల్ జిల్లాల్లో జరిగే అగ్నిప్రమాద చర్యలకు ఉపయోగించనుంది తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…