Hyderabad: చప్పుడు కాకుండా సోషల్ మీడియాలోనే బాగోతం అంతా.. ఎంక్వైరీలో దిమ్మతిరిగే నిజాలు

డ్రగ్స్‌ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. యస్, సోషల్ మీడియా యాప్స్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు, సప్లై జరుగుతున్నట్టు గుర్తించారు హైదరాబాద్‌ పోలీసులు. ఈ దందా నడుపుతున్న ముఠాలను అరెస్టు చేశారు.

Hyderabad: చప్పుడు కాకుండా సోషల్ మీడియాలోనే బాగోతం అంతా.. ఎంక్వైరీలో దిమ్మతిరిగే నిజాలు
Drugs
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 29, 2022 | 8:57 PM

Telangana: దేశంలో ప్రధాన నగరాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసి, రెండు ముఠాలు డ్రగ్స్ దందా చేస్తున్నాయని వెల్లడించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CV Anand). హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న 2 ముఠాలను అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఎబుకా సుజీ అనే వ్యక్తి ఈ దందా చేస్తున్నాడని, అతని కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు సీపీ. వీరు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి యాప్స్‌ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకొని, సప్లై చేస్తున్నారని వివరించారు. ఈ ముఠాలో ఎక్కువ మంది టూరిస్ట్‌ విసామీద భారత్‌కు వచ్చారని చెప్పారు సీవీ ఆనంద్. హేన్రీ చిగ్బో అనే వ్యక్తి టూరిస్ట్ వీసా మీద వచ్చాడని, వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటూ డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని వెల్లడించారు. ఈ ముఠాల్లో ఇమాన్యుల్ అనే మరో కీలక నిందితుడు ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని, ఇమాన్యుల్, ఎబుకా సుజీ ఇద్దరు ఒకే గ్యాంగ్‌కి చెందిన వారుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. త్వరలో వీరిని పట్టుకుంటామన్నారు.

అటు, వీసా గడువు ముగిసినా భారత్‌లో ఉంటున్న నైజీరియన్‌లను వారి దేశాలకు పంపుతామని స్పష్టం చేశారు. దేశంలోకి వచ్చి అక్రమంగా ఉంటున్నారని, వీసాలు గడవు ముగిసిన తరువాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని వివరించారు. నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసినట్టు తెలుస్తోందన్నారు. 2500 మంది ఆఫ్రికన్స్ ఉంటే, వారిలో 750 మంది పైగానే వీసాలు గడువు ముగిసినవారు ఉన్నారని వివరించారు. కార్డెన్స్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామన్నారు సీపీ సీవీ ఆనంద్.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి