Hyderabad: కోకపేట్‌లో కోట్లు కురిపిస్తోన్న భూములు.. ఎకరం ధర ఎంత పలికిందో తెలిస్తే షాక్‌ అవుతారు

ఎన్ని కోట్లయినా సరే భూములను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఒక ఎకరానికి గరిష్టంగా రూ. 72 కోట్లు పలికిందంటే నియోపోలీస్ భూములకు ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. మొదటి విడతలో భాగంగా గురువారం 26.86 ఎకరాలకు వేలం పాట నిర్వహిస్తున్నారు. ఉదయం జరిగిన మొదటి విడత వేలం ద్వారా రూ. 1532.50 కోట్ల ఆధాయం వచ్చింది. అత్యల్పంగా ఎకరం భూమి 51.75 కోట్లు పలికింది. ఇదిలా ఉంటే ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 35 కోట్లు కోట్లు మాత్రమే. వేలంలో భూములకు అంచనాలకు మించిన ఆదాయం వచ్చింది...

Hyderabad: కోకపేట్‌లో కోట్లు కురిపిస్తోన్న భూములు.. ఎకరం ధర ఎంత పలికిందో తెలిస్తే షాక్‌ అవుతారు
Hmda Land Auction

Updated on: Aug 03, 2023 | 3:46 PM

హైదరాబాద్, జులై 03: కోకపేట్‌లో కోట్లు కురుస్తున్నాయి. HMDA నిర్వహించిన భూముల అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. నిధుల సమీకరణ కోసం HMDA గురువారం భూముల అమ్మక ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. కోకాపేట్‌లోని నియో పోలీస్‌ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను అమ్మకానికి పెట్టింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం సెషన్‌లో భాగంగా మొత్తం నాలుగు ఫ్లాట్లకు హెచ్‌ఎమ్‌డీఏ వేలం నిర్వహించింది. ఇందులో ఒక ఫ్లాట్ అత్యధికంగా ఎకరం ఏకంగా రూ. 72 కోట్లకు అమ్ముపోయింది. ఈ వేలంలో ప్లాట్ల కోసం రియల్టర్లు ఎగబడ్డారు.

ఎన్ని కోట్లయినా సరే భూములను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. ఒక ఎకరానికి గరిష్టంగా రూ. 72 కోట్లు పలికిందంటే నియోపోలీస్ భూములకు ఉన్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. మొదటి విడతలో భాగంగా గురువారం 26.86 ఎకరాలకు వేలం పాట నిర్వహిస్తున్నారు. ఉదయం జరిగిన మొదటి విడత వేలం ద్వారా రూ. 1532.50 కోట్ల ఆధాయం వచ్చింది. అత్యల్పంగా ఎకరం భూమి 51.75 కోట్లు పలికింది. ఇదిలా ఉంటే ఈ భూములకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర 35 కోట్లు కోట్లు మాత్రమే. వేలంలో భూములకు అంచనాలకు మించిన ఆదాయం వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం 10,11,14 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు వరకు వేలంపాట కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఔటర్‌ రింగ్‌రోడ్‌కు అనుకుని ఉన్న ఫ్లాట్‌కి భారీగా ధర పలకడం విశేషం. 45ఎకరాల్లో 7 ప్లాట్లకు ఉదయం నుంచి ప్రక్రియ జరగనుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..