AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్లలో చోటు దక్కని హరీశ్

గత అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే రికార్డుస్థాయి మెజార్టీతో గెలిచిన హరీశ్‌‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన కొడుకు కేటీఆర్‌కు పట్టం కట్టేందుకు హరీశ్‌ను పూర్తిగా పక్కనబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం అ‍ందుకు నిదర్శనం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసే నేతల జాబితాలోనూ హరీశ్‍కు చోటు దక్కకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో […]

టీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్లలో చోటు దక్కని హరీశ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2019 | 7:43 PM

Share

గత అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే రికార్డుస్థాయి మెజార్టీతో గెలిచిన హరీశ్‌‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తన కొడుకు కేటీఆర్‌కు పట్టం కట్టేందుకు హరీశ్‌ను పూర్తిగా పక్కనబెట్టే కుట్రలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం అ‍ందుకు నిదర్శనం. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసే నేతల జాబితాలోనూ హరీశ్‍కు చోటు దక్కకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ అందుకు తగినట్లుగా అన్ని చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్లాన్ అమలుచేస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారంలో పాల్గొనేందుకు 20మందిని ఎంపిక చేసింది. ఈ జాబితాలో కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, వి.ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఆర్. శ్రావణ్ కుమార్, బండ ప్రకాశ్, టి.రవీందర్ రావు పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను టీఆర్ఎస్ వర్గాలు ఎన్నికల సంఘానికి సమర్పించాయి.

Follow Us
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
కట్టర్ హిందూ.. అప్పట్లోనే రుణమాఫీ చేసిన ప్రధానమంత్రి!
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
ఆరోజు ఆమె లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని..: భారత మాజీ ఆటగాడు
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
గుండెపోటుకు చెక్ పెట్టే గుప్పెడు పల్లీలు..ఆ తీవ్రమైన సమస్యకు ఔషధం
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
కూరలో ఉప్పు ఎక్కువైందా..? చిటికెలో సెట్ చేసే అద్భుతమైన చిట్కాలు..
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
ధన మహార్ధశ.. జూలై వరకు తిరుగులేని జీవితం వీరిదే..పట్టింది బంగారమే
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ రివ్యూ.. వడ్డే నవీన్ మూవీ ఎలా ఉందంటే?
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
తలరాత మారే టైమ్ వచ్చింది.. ఆగస్టు వరకు వీరికి అదృష్టం
Trending Song: ఏం పాటరా బాబూ! మైండ్ లో నుంచి అసలు పోవట్లేదుగా..
Trending Song: ఏం పాటరా బాబూ! మైండ్ లో నుంచి అసలు పోవట్లేదుగా..
వీడెవడండీ బాబు!ఊరందరినీ కంగారు పెట్టి మురుగు కాలువలో గుర్రుపెడుతూ
వీడెవడండీ బాబు!ఊరందరినీ కంగారు పెట్టి మురుగు కాలువలో గుర్రుపెడుతూ
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా?
కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా?