Bathukamma Sarees: తెలంగాణ ఆడపడుచులకు గుడ్ న్యూస్.. పంపిణీకి సిద్ధమైన బతుకమ్మ చీరలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చేయించిన
Bathukamma Sarees Distribution: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం అవుతోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తీరొక్క రంగుల్లో బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చేయించిన 240 పై చిలుకు వివిధ వెరైటీ డిజైన్ ల చీరలను పంపిణీ చేయనున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 4 వరకు జరుగు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. అందరూ ఆనందోత్సవంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం.. ఖర్చుకు వెనుకాడకుండా చీరలను అందిస్తోంది.
ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 వార్డుల స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా మంత్రులు.. చీరలు పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కావలసిన చీరలు గోడౌన్‌లో ఇప్పటికే నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతోపాటు హైదరాబాద్ జిల్లాలోని 30 సర్కిళ్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది. 624 రేషన్ షాపులలో 8 లక్షల 94 వేల 871 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9 లక్షల 2 వేల 84 చీరెల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 5 లక్షల 76 వేల 161 చీరలను పంపిణీ చేశారు.
-విద్యాసాగర్, టీవీ9 తెలుగు రిపోర్టర్, హైదరాబాద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం