AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వర్షాకాలం ట్రాఫిక్ సమస్యలకు చెక్.. బల్ధియా అధికారుల కొత్త యాక్షన్ ప్లాన్..

వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ చేపట్టింది తెలంగాణ సర్కార్. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీళ్లు రోడ్లపై నిలకుండా సంపులు కడతామంటోంది తెలంగాణ సర్కారు. అందుకు సంబంధించి యాక్షన్‌ స్టార్ట్‌ చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించారు.

Hyderabad: వర్షాకాలం ట్రాఫిక్ సమస్యలకు చెక్.. బల్ధియా అధికారుల కొత్త యాక్షన్ ప్లాన్..
Hyderabad
Srikar T
|

Updated on: Jul 11, 2024 | 7:29 AM

Share

వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కార్యచరణ చేపట్టింది తెలంగాణ సర్కార్. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపు నీళ్లు రోడ్లపై నిలకుండా సంపులు కడతామంటోంది తెలంగాణ సర్కారు. అందుకు సంబంధించి యాక్షన్‌ స్టార్ట్‌ చేసింది. ఈ మేరకు ఖైరతాబాద్ జంక్షన్, రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సోమాజిగూడ ఆర్టీఏ ఆఫీస్ ప్రాంతాల్లో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల సంపులను నిర్మించనున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్ వెల్లడించారు. వర్షాకాలం వచ్చేసింది. చినుకు పడితే హైదరాబాద్ నగర వాసుల్లో వణుకు పుడుతుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపు నీటిప్రవాహానికి గల్లీలన్నీ నీట మునిగిపోతాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉంటుంది. వాటిని అధిగమించడం కోసం సరికొత్త ప్రణాళికలు రూపొందించారు బల్ధియా అధికారులు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు దానకిశోర్. వర్షకాలంలో నీళ్లు నిలిచి ఉండే 140 ప్రాంతాల్లో.. సంపులు నిర్మించడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. మొదటగా ఖైరతాబాద్ జోన్, జూబ్లీహిల్ సర్కిళ్లలో సంపులు నిర్మిస్తామన్నారు దానకిశోర్. మొత్తం 11 ప్రాంతాల్లో 20 కోట్ల రూపాయలతో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులు నిర్మిస్తామని వెల్లడించారు. వర్షం కురిసే సమయంలో ఈ సంపుల్లో నీటిని సేకరించి.. సమీపంలో ఉన్న నాలాల్లో పంపింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు, ఎస్ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్. మొత్తంగా.. సీఎం ఆదేశాలతో వాటర్‌ లాగింగ్‌ ప్రాంతాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు మున్సిపల్‌ శాఖ అధికారులు. త్వరతగతిన సంపులు నిర్మించేందుకు స్థల సేకరణలో బిజీ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..