ఆహా ఏమి రుచి.. ఎగబడి తింటే ఎక్స్‌పైరీ డేటే.. ఊరూరా అదే జరుగుతోందిగా..
ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. రాజమండ్రిలో జరిగిన విషాదకర పాల కలుషిత ఘటన మళ్లీ ఆహార భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. పాలలో ప్రమాదకర రసాయనాలు కలవడం వల్ల అమాయక ప్రాణాలు కోల్పోయిన సంఘటన ప్రజలను కలవరపెట్టింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా నకిలీ పాలు, కల్తీ పన్నీర్, నెయ్యి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెస్టారెంట్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలపై అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తుండగా.. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి..

రాజమండ్రిలో పాలకూట విషం. ఇప్పట్లో మర్చిపోయే విషాదమేనా అది?పాలల్లో కల్తీ జరిగి 16 నిండు ప్రాణాలు బలైపోయిన దారుణ ఘటన. ఫ్రిజ్‌లో ఇథలీన్ గ్లైకాల్ అనే ప్రమాదకర రసాయనం లీకై, పాలల్లో కలిసి, ఆ పాలు ఇంటింటికీ చేరి.. ఇంటిల్లిపాదీ ఆస్పత్రిపాలయ్యేలా చేసింది. కల్తీ పాలు తాగిన పాపానికి మూత్రపిండాలు డ్యామేజయ్యి, ఆ తర్వాత మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసింది. తాగే పాలు కూడా ప్రాణాంతకమేనని అప్పుడే గట్టిగా ఫిక్సయ్యారు జనం. ఘటన జరిగింది, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి చౌడేశ్వరి నగర్‌లోని ఒక పాలకేంద్రంలో. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే, సబ్జెక్ట్ యూనివర్సల్ కాబట్టి. ప్రతీఒక్కరూ రోజూ తాగే పాలు, అందులో కల్తీ గురించి కాబట్టి. నిజానికి, రాజమండ్రి పాల కల్తీ ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, చిన్న నిర్లక్ష్యం ఖరీదు అన్నేసి ప్రాణాల్ని తీసుకెళ్లింది. కానీ, పనిగట్టుకుని పాలలో కల్తీ చేసి, నకిలీ పాలనే గేదె పాలుగా నమ్మించి అమ్మితే..? అదే జరుగుతోంది ఇప్పుడు ఊరూరా. 9 నెలల చిన్నారి రుహానియా.. నాలుగు నెలలుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. రోజుకు 50 నుంచి 60 వేలు పోసి ట్రీట్మెంట్ ఇచ్చినా, పాప బతుకు మీద కన్నవాళ్లకు ఆశల్లేవు. ఆ పసిపాప చేసిన నేరమల్లా ఏంటంటే, ఆకలేసి ఏడిస్తే తెలిసోతెలీకో అమ్మ పట్టిన కల్తీ పాలు తాగడమే. నాలుగునెలల కిందటి రాజమండ్రి కల్తీ పాల ట్రాజెడీలో ఇటువంటి పాథెటిక్ సీన్లు ఇప్పటికీ...
