Hyderabad: చరిత్రలో తొలిసారి ఆ నిర్ణయం తీసుకున్న ఓల్డ్‌ సిటీ పోలీసులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భాషాభిమానులు

అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఉర్దూ భాష మరోసారి కాస్త వెలుగులోకి వచ్చింది. 1969నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన పోరులో ముస్లింల భావజాలానికి ప్రాధాన్యం పెరిగింది. 2014లో రాష్ట్ర సాధన తర్వాత ఉర్దూ భాష సౌందర్యం, ముస్లింలకు పెద్దపటీ వేసిన కేసీఆర్‌.. ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా మార్చడంతో ఉర్దూ ప్రాభవం మరింత పెరిగింది...

Hyderabad: చరిత్రలో తొలిసారి ఆ నిర్ణయం తీసుకున్న ఓల్డ్‌ సిటీ పోలీసులు.. హర్షం వ్యక్తం చేస్తున్న భాషాభిమానులు
Hyderabad Old City Police

Edited By:

Updated on: Aug 15, 2023 | 12:20 PM

తెలంగాణలో హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా ఉర్దూ మాట్లాడతారు. అందుకు కారణం రాష్ట్రం నిజాంపాలనలో ఉండడమే. వందల ఏళ్లపాటు తెలంగాణ ప్రజలతో ఉర్దూ మమేకమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లినా ఉర్దూ చదవడం రానివారు ఉంటారేమోగాని.. ఉర్దూ మాట్లాడలేని వారు ఉండకపోవడం విశేషం. తెలుగుతోపాటు అంతలా పెనవేసుకుపోయిన ఉర్దూ భాష.. అనంతరం ఉమ్మడి ఏపీలో క్రమంగా వైభవం కోల్పోయింది. అన్ని అధికారిక కార్యక్రమాల్లో తెలుగు, ఇంగ్లీషు రాజ్యమేలింది. ఈ పరిస్థితిపై కొందరు ముస్లిం పెద్దలు అభ్యంతరం చెప్పిన ఘటనలూ ఉన్నాయి.

అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై సాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో ఉర్దూ భాష మరోసారి కాస్త వెలుగులోకి వచ్చింది. 1969నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన పోరులో ముస్లింల భావజాలానికి ప్రాధాన్యం పెరిగింది. 2014లో రాష్ట్ర సాధన తర్వాత ఉర్దూ భాష సౌందర్యం, ముస్లింలకు పెద్దపటీ వేసిన కేసీఆర్‌.. ఉర్దూ భాషను రెండో అధికారిక భాషగా మార్చడంతో ఉర్దూ ప్రాభవం మరింత పెరిగింది…ఇంత వరకు బాగానే ఉన్నా.. అన్ని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లలోనూ అయితే ఇంగ్లీషు, లేదంటే తెలుగులో ప్రకటనలు జారీచేసే చేయడం పరిపాటి. ఇలాంటి నేపేథ్యంలో ఓ పోలీస్‌స్టేషన్‌ తొలిసారి ఉర్దూలో ప్రెస్‌నోట్‌ రిలీజ్‌చేయడంపై ఉర్దూ భాషాభిమానులు హర్షం ప్రకటిస్తున్నారు.

ఉర్దూను రెండోభాషగా ప్రకటించడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ఆ భాషలో వచ్చింది లేదు. తొలిసారి పోలీసులు ఉర్దూలో ప్రకటన రిలీజ్‌ చేయడంపై ముస్లింలు, ఉర్దూ భాషాభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ముస్లింలకు సులువుగా అర్థమయ్యే ఉర్దూలోనే అన్ని కార్యాలయాల్లో ప్రకటనలు ఉండాలని కోరుతున్నారు. తెలుగు, ఇంగ్లీషులో ప్రకటనలు జారీచేయడం వల్ల తమకు అర్థంకాక ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు ఆవేదన చెందుతున్నారు. తమ ఆవేదనను గుర్తించి తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఉర్దూలోనూ అధికారిక ప్రకటనలు జారీచేస్తే మేలు జరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

తొలిసారి ఉర్దూలో ప్రెస్‌నోట్‌ విడుదల చేసిన పాతబస్తీ భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం రవీందర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు…హైదరాబాద్‌ పాతబస్తీ భవానీనగర్‌ పరిధిలో అబ్దుల్‌ సమీర్‌ అనే వ్యక్తి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడన్న కేసులో పోలీసులు తొలిసారి ఉర్దూలో ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ చేశారు. అబ్దుల్‌ సమీర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా.. కోర్టు అతడికి ఒక్కరోజు జైలు శిక్ష విధించినట్లు ఉర్దూలో నోట్‌ విడుదల చేశారు పోలీసులు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు పంపినట్లు చెప్పారు.

 

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..