AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో 75 ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. కారణం అదే!

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి 75 ఏళ్లుగా మువ్వన్నెల పతాకాన్ని అవనతం చేయకుండా నిరంతరాయంగా రెపరెపలాడుతూనే ఉంది. నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసే..

Telangana: ఆ గ్రామంలో 75 ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. కారణం అదే!
Begumpet village
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 15, 2023 | 11:16 AM

Share

యాదాద్రి, ఆగస్టు 15: ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశభక్తిని అలవర్చుకునేందుకు స్వాతంత్య్రం సాధించుకున్నప్పటి నుంచి అంటే 75 ఏళ్లుగా ఆ గ్రామంలో నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. నిరంతరాయంగా మూడు రంగుల జాతీయ పతాకం ఎగురుతున్న గ్రామం ఎక్కడో తెలుసుకోవాలంటే..

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి 75 ఏళ్లుగా మువ్వన్నెల పతాకాన్ని అవనతం చేయకుండా నిరంతరాయంగా రెపరెపలాడుతూనే ఉంది. నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసే ఆనవాయితీని ఇక్కడ గ్రామస్తులు కొనసాగించడం విశేషం.

దేశభక్తి, జాతీయ భావం స్ఫూర్తితో ఇక్కడ గ్రామస్తులు చందాలు వేసుకుని 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నారులు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ నాయకుల స్మరణకు తోడు మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిఏటా పంద్రాగస్టు,గణతంత్ర దినోత్సవం, దసరా రోజున గ్రామపెద్దలు దానిని తొలగించి నూతన జాతీయ జెండాను అమర్చి ఎగుర వేస్తామని గ్రామస్తులు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. 75 ఏళ్లుగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఆ గ్రామస్తులకు సెల్యూట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు