
Flyovers Closed In Hyderabad: పట్టణంలో ఏవైనా ఉత్సవాలు, వేడుకలు, పండుగలు జరిగినా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం సర్వసాధారణమైన విషయం. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో పోలీసులు గురువారం ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు గురువారం రాత్రి 10 గంటల నుంచి నగరంలోని గ్రీన్ ల్యాండ్స్, లంగర్ హౌజ్, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసేయనున్నట్లు ప్రకటించారు. జగ్‌నేకీ రాత్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి అమల్లో ఉండే నిషేదాజ్ఞలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా జరగనున్న ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్‌లో పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ తెలిపారు. తాజ్ ఐలాండ్, చాపెల్ రోడ్ టీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్, బషీర్ బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి వాహనాలను మళ్లించనున్నారు.
Also Read: White snake Appeared: మహాశివరాత్రి వేళ మహా అద్భుతం… మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం