Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకుడి తత్తరపాటు.. ఆపి తనిఖీ చేయగా
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హైదరాబాద్ యూనిట్... శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో రూ3.45 కోట్ల విలువైన 3.5 కిలోగ్రాముల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. నిందితుడికి ఇద్దరు గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ సహాయం చేసినట్లు గుర్తించి.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో.. అక్రమ రవాణాకు హద్దే లేకుండా పోయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి బంగారం తెస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి దగ్గర మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 10 బంగారు బిస్కెట్‌లను మూడు జేబుల్లో అమర్చుకొని వస్తుండగా పట్టుకున్నారు అధికారులు. నిందితుడికి ఎయిర్‌పోర్టులోని గ్రౌండ్ స్టాఫ్ సహకరించినట్లు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ మూడు కోట్ల 45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇటీవల బంగారం తులం లక్ష దాటడంతో.. అక్రమ రవాణాను ఎంచుకున్నారు. దుబాయ్‌లో తక్కువకు కొని.. ఇక్కడికి తరలిస్తున్నారు. నిందితుడితో ఎవరు బంగారం తెప్పిస్తున్నారనేది కూపీ లాగుతున్నారు.
దర్యాప్తులో 3500 గ్రాముల బరువు, 99.9% స్వచ్ఛత కలిగిన బంగారు బిస్కెట్‌లను ప్రయాణీకుడు, గ్రౌండ్ సిబ్బంది సమన్వయంతో రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. విమానాశ్రయ పార్కింగ్ ప్రాంతంలో వేచి ఉన్న మరొక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెంట్‌కు బంగారాన్ని తెలివిగా డెలివరీ చేయాలనేది వారి ప్లాన్. అతను కస్టమ్స్ ఇబ్బందులను క్లియర్ చేసిన తర్వాత బంగారాన్ని ప్రయాణీకుడికి తిరిగి ఇవ్వాలన్నది టాస్క్. అయితే అధికారుల అప్రమత్తలో వీరి ప్రయత్నం భగ్నమైంది. మూడు వేర్వేరు ప్యాకెట్లలో దాచి ఉంచిన మొత్తం 30 బంగారు బిస్కెట్‌లు, ప్యాకింగ్ సామాగ్రిని కూడా DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Seized Gold
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…!
