AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి దారేది..? హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఇనుప జాలీలు.. ఆంక్షల బ్యానర్లు..

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం మరోసారి ఆంక్షల ఉచ్చులో చిక్కుకుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జానికి క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. హుస్సేన్‌సాగర్‌లో ఇప్పుడు ఎటు చూసినా ఇనుప జాలీలు కనిపిస్తున్నాయి.

Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి దారేది..? హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఇనుప జాలీలు.. ఆంక్షల బ్యానర్లు..
Ganesh Immersion in Hussain Sagar
Peddaprolu Jyothi
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 10, 2024 | 3:33 PM

Share

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం మరోసారి ఆంక్షల ఉచ్చులో చిక్కుకుంది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జానికి క్రేన్లు ఏర్పాటు చేశామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. హుస్సేన్‌సాగర్‌లో ఇప్పుడు ఎటు చూసినా ఇనుప జాలీలు కనిపిస్తున్నాయి. నిమజ్జనాలకు అనుమతి లేదనే బ్యానర్లు వాటికి కట్టారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి అనుమతి లేదు.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు GHMC కమిషనర్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ పేర్లతో బ్యానర్లు కట్టారు. దీంతో హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతుందా..? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరో వైపు హుస్సేన్‌సాగర్‌లో గణపతి విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకుండా గతంలో ఉన్న ఆదేశాలు అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా గతేడాది విగ్రహతయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. హుస్సేన్‌ సాగర్‌ సహ, హైదరాబాద్‌లోని జలవనరుల్లో ఎక్కడా PoP విగ్రహాలు నిమజ్జనం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతేడాది నిమజ్జానికి నాలుగు రోజుల ముందు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలు ఈసారి అమల్లయ్యేలా చూడాలని పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు హుస్సెన్ సాగర్‌లో నిమజ్జనంపై ఆంక్షల నేపథ్యంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు ఏం విధంగా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.. వాస్తవానికి వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ రకాల విగ్రహాలతో ట్యాంక్‌బండ్ వద్దకు తరలివస్తారు… ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం సమయానికి ఈ అంశం తెర మీదికి వస్తుంది. దీంతో హైకోర్టు సైతం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించడం పరిపాటిగా మారింది. దానికి అనుగుణంగా బేబీ పాయింట్స్ ను ఏర్పాటు చేశామని, మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం వివరణ ఇస్తోంది.

అయితే.. గతేడాది సెప్టెంబర్ 25న నిమజ్జనం సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఎన్టీఆర్ మార్గం నెక్లెస్ రోడ్ లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చినప్పటికీ.. అన్ని రకాల గణపతి విగ్రహాలు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే నిమజ్జనం అంశం మళ్లీ తెర మీదకి రావడంతో ఈసారి కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది సర్వత్ర ఉత్కంఠగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..