ఫ్యాన్సీ నెంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రూ.30 లక్షల రాబడి
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణాశాఖ సోమవారం నిర్వహించిన నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రూ.30,55,748లక్షల రాబడి లభించింది. ఒక్క 9999 నంబరు రూ.10లక్షలు పలికింది. ప్రస్తుతం ముగుస్తున్న సీరీస్ టీఎస్09 ఎఫ్‌ఈలో 9999 నంబరును ఎన్‌ఎస్‌ఎల్ ప్రాపర్టీస్ సంస్థ రూ.10లక్షలు వెచ్చించి కైవసం చేసుకుంది. పాత సీరీస్ ముగిసి కొత్త సీరీస్ అయిన ‘టీఎస్09 ఎఫ్‌ఎఫ్’లోకి అడుగు పెట్టింది. అందులో ‘1’ నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్ హిల్ హోటల్స్ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్ […]

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణాశాఖ సోమవారం నిర్వహించిన నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రూ.30,55,748లక్షల రాబడి లభించింది. ఒక్క 9999 నంబరు రూ.10లక్షలు పలికింది. ప్రస్తుతం ముగుస్తున్న సీరీస్ టీఎస్09 ఎఫ్‌ఈలో 9999 నంబరును ఎన్‌ఎస్‌ఎల్ ప్రాపర్టీస్ సంస్థ రూ.10లక్షలు వెచ్చించి కైవసం చేసుకుంది. పాత సీరీస్ ముగిసి కొత్త సీరీస్ అయిన ‘టీఎస్09 ఎఫ్‌ఎఫ్’లోకి అడుగు పెట్టింది. అందులో ‘1’ నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్ హిల్ హోటల్స్ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్ అగ్రినోవో సంస్థ రూ.2.78లక్షలు చెల్లించి దక్కించుకుంది. ఇక్కడ 9 సంఖ్యకు బాగా డిమాండ్ ఉన్నా ఈ పర్యాయం అధికారులు నిర్ణయించిన రూ.50వేలు మాత్రమే పలికింది.



