AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్సీ నంబర్ వేలం.. ఆఫీసులో ‘వార్‌ సీన్’

తమ కార్లు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్‌ల కోసం పోటీపడుతుంటారు చాలామంది. అందుకోసం ఎంత చెల్లించడానికైనా వారు వెనకాడరు. కాగా ఇటీవల ఖైరతాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన నంబర్ల వేలంలో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్‌లో రవాణాశాఖ నంబర్ల వేలం నిర్వహించింది. అందులో‘టీఎస్09 ఎఫ్ఎఫ్‌’తో కొత్త సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఎంతో డిమాండ్ ఉన్న 0001 కోసం ఘర్షణ జరిగింది. సాధారణంగా ఫ్యాన్సీ […]

ఫ్యాన్సీ నంబర్ వేలం.. ఆఫీసులో ‘వార్‌ సీన్’
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 16, 2019 | 2:12 PM

Share

తమ కార్లు, బైక్‌లకు ఫ్యాన్సీ నంబర్‌ల కోసం పోటీపడుతుంటారు చాలామంది. అందుకోసం ఎంత చెల్లించడానికైనా వారు వెనకాడరు. కాగా ఇటీవల ఖైరతాబాద్‌ ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన నంబర్ల వేలంలో ఓ ఫ్యాన్సీ నంబర్ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

సోమవారం ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌జోన్‌లో రవాణాశాఖ నంబర్ల వేలం నిర్వహించింది. అందులో‘టీఎస్09 ఎఫ్ఎఫ్‌’తో కొత్త సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఎంతో డిమాండ్ ఉన్న 0001 కోసం ఘర్షణ జరిగింది. సాధారణంగా ఫ్యాన్సీ నంబర్‌ను కోరుకున్న వారు దాని కోసం అధికారులు నిర్ణయించిన కనీస ధరతో పాటు అదనంగా వారికి ఇష్టమైన మొత్తాన్ని చెక్కుల రూపంలో టెండర్ బాక్స్‌లో వేయాలి. ఇందులో భాగంగా నిర్ణీత సమయంలో నలుగురు టెండర్ వేశారు. అయితే సమయం ముగిశాక టెండర్ బాక్స్‌లోని కవర్లు తీసుకెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కవరును అందులో వేసే ప్రయత్నం చేశాడు. దీనిపై మరో వ్యక్తి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తరువాత ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. కాగా ఈ నంబర్‌ను ఎఫ్ఆర్ఆర్ హిల్ హోటల్స్ రూ.6.95లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. మొత్తానికి సోమవారం జరిగిన వేలంతో ఖైరతాబాద్ ఆర్టీవో సంస్థకు రూ.30,55,748లక్షల రాబడి లభించింది.

Follow Us
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
గౌహతీ వన్డేలో గిల్‌ డబుల్ సెంచరీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
పూరీ పిండి ఇలా కలిపితే నూనె అస్సలు పీల్చవు..
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
హైదరాబాద్‌లో హిట్‌ అండ్ రన్.. 9 మందిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు!
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
రైల్వేశాఖ గుడ్ న్యూస్.. దసరాకు ఈ మార్గంలో ప్రత్యేక రైళ్లు..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
గ్రీన్ టీ తో మెరిసే చర్మం.. ఇలా చేస్తే పార్లర్‌కు వెళ్లే..
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
నిమ్మకాయలను ఇలా దాచుకోండి.. 2–3 నెలల వరకు పనికొస్తాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ కీలక చర్చలు
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
హీరో రామ్‌తో ఉన్న ఈ జబర్దస్త్ స్టార్ కమెడియన్‌ను గుర్తు పట్టారా?
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
కుజ-శని యోగం.. ఈ రాశులకు కీలక మార్పులు తథ్యం!
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..
ఇంటి నిర్మాణం కోసం గొయ్యి తవ్వితే బయటపడ్డ వింత జీవి..