AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొచ్చె, కొరమీనుకు మించి అద్భుత రుచి ఈ చేపలోనే దొరికిద్ది.. ఎవ్వరైనా ఓ పట్టు పట్టాల్సిందే

బొచ్చె, కొరమీనుకు మించి అద్భుత రుచి ఈ చేపలోనే దొరికిద్ది. ఈ చేప ఏంటిది అని సందేహిస్తున్నారా? కానీ, ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఎవ్వరైనా ఓ పట్టు పట్టాల్సిందే. మరి, దీనికి పదార్థాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 12:20 PM

Share
బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్థాలు: అర కిలో బొమ్మిడాయిల చేపలు, 2 ఉల్లిపాయలు , రెండు టమాటాలు, 
కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి,  10 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర,  అర టేబుల్ స్పూన్ పసుపు, 
రెండు టేబుల్ స్పూన్స్ కారం,  ఒక టేబుల్ స్పూన్  ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్థాలు: అర కిలో బొమ్మిడాయిల చేపలు, 2 ఉల్లిపాయలు , రెండు టమాటాలు, కొద్దిగా చింతపండు, 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి, రుచికి సరిపడా ఉప్పు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం: ముందుగా చేపలను రెడీ చేసుకోవాలి: ముందుగా బొమ్మిడాయిల చేపలను తీసుకుని వాటిని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసి బాగా  కడగాలి. ఆ తరవాత దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు రాసి 5  నిమిషాలు పక్కన పెట్టి దీనిని మళ్ళీ ఇంకోసారి కడగాలి. ఇలా చేస్తే నీచు వాసన మొత్తం పోతోంది.

2 / 5
బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి కూడా  వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వీటిని బాగా  వేయించాలి.
ఇంకా దీనిలో టమాటాలు కూడా  వేసి మెత్తబడే వీటిని ఉడికించాలి.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేయాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటాలు కూడా వేసి మెత్తబడే వీటిని ఉడికించాలి.

3 / 5
బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 3 : ఆ  తరువాత దీనిలో కొద్దిగా  కారం,  చిటికెడు పసుపు, ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్  ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసి  దీనిని బాగా కలపాలి.  అలాగే, దీనిలో చింతపండు రసం కూడా పోసి తగినంత నీరు, 
ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 3 : ఆ తరువాత దీనిలో కొద్దిగా కారం, చిటికెడు పసుపు, ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసి దీనిని బాగా కలపాలి. అలాగే, దీనిలో చింతపండు రసం కూడా పోసి తగినంత నీరు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.

4 / 5

బొమ్మిడాయిల పులుసు తయారీ విధానం స్టెప్ 4 :  ఇక ఇప్పుడు దీనిలో చేపలను వేసుకుని కొద్దీ సేపు కదలకుండా ఉంచుకోవాలి. ఇంకా ఎక్కువగా  పాత్రను మెల్లగా కదిలించాలి. మూతపెట్టి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి. చివర్లో  మెంతుల పొడి, కొత్తిమీర కూడా  చల్లి స్టవ్ ఆఫ్  చేసి కిందకు దించుకోవడమే.

5 / 5
Follow Us