AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: వాయుగుండం అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే..?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సూచించారు.

Weather Update: వాయుగుండం అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇంకెన్ని రోజులంటే..?
Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2026 | 3:00 PM

Share

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు, నాలుగు రోజులు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్‌పై ఏర్పడిన నిన్నటి తీవ్ర వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా కదిలి, ఈరోజు, జూలై 30, 2026, ఉదయం 0830 గంటలకు (భారత కాలమానము ప్రకారం) పశ్చిమ మధ్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకొని ఉన్న విదర్భ & ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. ఇది 21.0°N అక్షాంశం – 81.3°E రేఖాంశం వద్ద, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్)కు దక్షిణంగా, రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్)కు 30 కి.మీ. తూర్పు-ఆగ్నేయంగా, రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు 50 కి.మీ. పశ్చిమ-నైరుతిగా, గోండియా (మహారాష్ట్ర)కు 130 కి.మీ. తూర్పు-ఆగ్నేయంగా, బ్రహ్మపురి (మహారాష్ట్ర)కు 160 కి.మీ. తూర్పు-ఈశాన్యంగా సమీపంలో ఉంది.

ఇది రాబోయే 12 గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఇది విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా వాయుగుండంగా కదిలే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, రైసెన్, పశ్చిమ మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమ ప్రాంతాలు, విదర్భ & ఆగ్నేయ మధ్యప్రదేశ్‌లోని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై ఉన్న తీవ్ర వాయుగుండం కేంద్రం, గోపాల్‌పూర్ మీదుగా ప్రయాణిస్తూ, అక్కడి నుండి ఆగ్నేయంగా బంగాళాఖాతం మధ్య భాగాల వైపు కదులుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది.

మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్పం మీదుగా తూర్పు-పడమర దిశగా, సుమారుగా 21° ఉత్తర అక్షాంశం వెంబడి ‘షియర్ జోన్ లేదా గాలుల కొత సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి.మీ. ఎత్తులో, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం దిశగా విస్తరించి కొనసాగుతోంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్;-

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం, శుక్రవారం, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైద్రాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us