AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతరుల వాహన నంబర్‌ను దుర్వినియోగం చేస్తూ ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..
Fake Number Plate Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 11:58 AM

Share

హైదరాబాద్ సిటీలో నకిలీ నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బైక్‌కు అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే చర్యలు చేపట్టారు. మదన్నపేట కుర్మగూడకు చెందిన మహ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తి తన వాహనానికి సంబంధించిన నంబర్‌ను మార్పు చేసి TG11A1698 ప్లేసులో TG11A1898గా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు విచారణలో తేలింది. అయితే ఈ వ్యవహారం ఓ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పాత మలక్‌పేట పద్మనగర్‌కు చెందిన షాహీన్ బేగం తన వాహన నంబర్‌ను మరొకరు దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వాహన నంబర్‌తో అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవుతుండటంతో చలానాలు కూడా ఆమె పేరుపైనే జారీ అవుతున్నాయని తెలిపారు.

ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించి ఏప్రిల్ 16న అరెస్ట్ చేశారు. ఈ కేసులో BNSతో పాటు మోటార్ వాహన చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, చాదర్‌ఘాట్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించారు. ఫేక్ లేదా మార్పిడి చేసిన నంబర్ ప్లేట్‌ల వినియోగం తీవ్రమైన నేరమని.. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. నగరంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థల సహాయంతో ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించి వాహనాలను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వాహన నంబర్ ప్లేట్‌ల దుర్వినియోగంపై అనుమానం ఉన్నట్లయితే పౌరులు వెంటనే సమాచారాన్ని అందించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇందుకోసం https://echallan.tspolice.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా echallanhelpdesk.hyd@gmail.com కు ఈమెయిల్ పంపడం ద్వారా కూడా సమాచారం అందించవచ్చు. అలాగే e-చలాన్ ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ 8712661690 కు మెసేజ్ పంపి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

Also Read: AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..

Follow Us