Hyderabad: నడిరోడ్డుపై తాగుబోతుల వీరంగం.. బైక్ నడుపుతూ మందు తాగుతూ నానా హంగామా..

| Edited By: Ravi Kiran

Jun 17, 2022 | 3:54 PM

నడిరోడ్డు మీద ట్రిఫిక్ మధ్యంలో ఈ మందుబాబులు వీరగంతో ఇతర వాహనదారులకు.. వెనుకా ముందు వచ్చే వారికి ప్రమాదకరంగా మారుతోంది.

Hyderabad: నడిరోడ్డుపై తాగుబోతుల వీరంగం.. బైక్ నడుపుతూ మందు తాగుతూ నానా హంగామా..
Hyderabad
Follow us on

Hyderabad: హైదరాబాద్ నగరంలో మందు బాబుల ఆగడాలు మితి మీరి పోతున్నాయి. ఇక్కడా అక్కడా అని కాదు..తాగుతూ నానాహంగామా సృష్టిస్తున్నారు. తాజాగా నడి రోడ్డుపై.. అది కూడా  బైక్ ని డ్రైవింగ్ చేస్తూ.. మందు తాగుతూ.. హల్ చల్ చేశారు. నడిరోడ్డు మీద ట్రిఫిక్ మధ్యంలో ఈ మందుబాబులు వీరగంతో ఇతర  వాహనదారులకు..  వెనుకా ముందు వచ్చే వారికి ప్రమాదకరంగా మారుతోంది. బైక్ డ్రైవింగ్ లో ఏ మాత్రం తప్పు జరిగినా తాగుబోతులు గాని.. వారి వెనుకాల వచ్చే వారికి గాని ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇద్దరు మందుబాబులు ఫుల్ గా తాగి.. నడిరోడ్డుమీద బండి పై వెళ్తూ.. ఇతరవాహనదారులకు యమ కింకర్లగా మారారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని భరత్‌ నగర్‌ బ్రిడ్జిపై ఇద్దరు మందు బాబులు బైక్‌పైనే ఫుల్ గా మద్యం తాగుతూ రోడ్డుపై నానా హంగామా చేశారు. ఒకరి తర్వాత ఒకరు మందు బాటిల్‌తో చిప్‌ కొడుతూ పక్కన ఉన్న వారికి చిరాకు తెప్పించారు. ఎన్ని దారుణమైన సంఘటలు జరిగినా ఎంతమంది ఇలాంటి వారి తప్పులకు బలవుతున్నా.. పోలీసులు ఎంత చెప్పినా ఇలాంటి వారు మాత్రం మారడం లేదు. ఇలాంటి తాగుబోతులు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారంటూ ఇతరులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.

Reporter: Noor, TV9 Telugu

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..