AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగరంలో ఇళ్లకు భారీ గిరాకీ.. ప్రపంచంలోనే 122 ర్యాంక్‌ సాధించిన హైదరాబాద్‌ మార్కెట్

Hyderabad: నివాస గృహాల మార్కెట్‌ రంగంలో భాగ్యనగరం దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌ ఇళ్ల ధరలు అనుహ్యంగా పెరిగిపోతున్నాయి...

Hyderabad: భాగ్యనగరంలో ఇళ్లకు భారీ గిరాకీ.. ప్రపంచంలోనే 122 ర్యాంక్‌  సాధించిన హైదరాబాద్‌ మార్కెట్
Hyderabad
Subhash Goud
|

Updated on: Apr 02, 2021 | 1:17 PM

Share

Hyderabad: నివాస గృహాల మార్కెట్‌ రంగంలో భాగ్యనగరం దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌ -డిసెంబర్‌ త్రైమాసికంలో హైదరాబాద్‌ ఇళ్ల ధరలు అనుహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆ త్రైమాసికంలో స్థిరాస్థి రంగంలో హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా 122 స్థానం దక్కించుకుంది. 2020 త్రైమాసికంలో గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌కు సంబంధించి నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ జాబితాలో హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు 129 స్థానం ఉండగా, అహ్మదాబాద్‌ 143, ముంబై 144, ఢిల్లీ 146, కోల్‌కతా 147, పూణె 148 స్థానాల్లో నిలిచాయి. 150 ర్యాంక్‌తో చెన్నై అట్టడుగు స్థానం నిలిచింది.

ప్రపంచ వ్యాప్తంగా నివాస స్థలాల ధరలు 2020 త్రైమాసికంలో పెరిగిన దేశంలో ఏకైక నగరం హైదరాబాద్‌ మాత్రమే. 2019 ఏడాదితో పోల్చుకుంటే ఇళ్ల ధరల పెరుగుదల వృద్ధి రేటు 0.2 శాతంగా ఉంది అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. దేశంలో ఇతర నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గుముఖం పడుతుంటే హైదరాబాద్‌ మాత్రం స్థిరాస్థి రంగం ప్రగతిపథంలో దూసుకుపోవడం విశేషం.

ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండడమే కారణం.. ఇక బెంగళూరులో ఇళ్ల ధరలు 0.8 శాతం తగ్గగా, అహ్మదాబాద్‌లో 3.1 శాతం, ముంబైలో 3.2 శాతం, ఢిల్లీ 3.9 శాతం, కోల్‌కతా 4.3 శాతం, పూణె 5.3 శాతం మేర ధరలు పడిపోయాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది.కరోనా వ్యాప్తి సమయంలోనూ హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ ఊపును కొనసాగించిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ శిశిర్‌ బజార్‌ ప్రశంసించారు. గత ఏడాదిలో అన్ని త్రైమాసికంలోనూ హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ ధరలు పెరుగుదల కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. ఐటీ ఉద్యోగులందరూ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉండటం ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, దేశంలోని స్థిరాస్థి మార్కెట్‌ రంగం మరింత పుంజుకుంది. కోవిడ్‌ కారణంగా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని ప్రజలు భావించడం, ఇళ్ల ధరలు కొద్దిగా తగ్గిపోవడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే ఇక్కడ ఇళ్ల ధరలు పెరుగుదల ప్రతియేటా 30.2శాతంగా ఉన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ నివేదికలో పేర్కొంది.

Visakhapatnam: స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సర్వేలో విశాఖకు మూడో స్థానం

Big Bazaar: ఆర్డర్‌ చేసిన రెండు గంటల్లోనే హోమ్‌ డెలివరి.. బిగ్‌బజార్‌ నిర్ణయం.. రూ.1000 దాటితే ఉచిత డెలివరీ

Ustad Bade Ghulam Ali Khan: అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సమాధి ఎక్కడుందో తెలుసా..

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్