Subhash Goud |
Updated on: Apr 02, 2021 | 12:28 PM
Big Bazaar: రిలైల్ రంగంలో ఉన్న బిగ్‌బజార్ వెంటనే హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్ల ఇంటికి చేరుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ, హోం తదితర విభాగాల్లో ఉత్పత్తులను సమీపంలోని బిగ్‌బజార్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు.
మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా వినియోగదారులకు కనీసం రూ.500 విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ విలువ రూ.1000 దాటితే డెలివరి చార్జీలు ఉచితం. అయితే ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
క్రమంగా ఇతర నగరాలకు ఈ హోండెలివరిని విస్తరించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ అధ్యక్షుడు కమల్‌దీప్ సింగ్ తెలిపారు. 45 రోజుల్లో 21 నగరాలకు, ఆరు నెలల్లో అన్ని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న బిగ్ బజార్ దేశ వ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లోని 285 ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ రిలైల్ ఖాతాలో ఫైపర్‌సిటీ, ఫుడ్ హాల్, ఎఫ్‌బీబీ, ఫుడ్ బజార్, హెరిటేజ్ ఫ్రెష్ కూడా ఉన్నాయి.