నగ్న వీడియోలతో బ్లాక్‌ మెయిల్.. ఫేస్‌బుక్ పరిచయం.. చాటింగ్ ఎవ్వారం.. నగరంలో నయా దందా..

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 4:49 PM

Hyderabad Crime : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. మొన్నటి వరకు లోన్ యాప్‌ల ద్వారా

నగ్న వీడియోలతో బ్లాక్‌ మెయిల్.. ఫేస్‌బుక్ పరిచయం.. చాటింగ్ ఎవ్వారం.. నగరంలో నయా దందా..
Cybercriminals
Follow us on

Hyderabad Crime : రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. మొన్నటి వరకు లోన్ యాప్‌ల ద్వారా జనాలను బురిడి కొట్టించిన నేరగాళ్లు ఇప్పడు సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లోని తార్నాకలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన ఓ వ్యక్తికి సంబంధించి నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ దందా షురూ చేశారు. వివరాల్లోకి వెళితే..

తార్నాక ప్రాంతంలో నివాసముండే ఓ ఈవెంట్‌ మేనేజర్‌కు ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇద్దరు ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. ఆ తరువాత వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తూ, బాధితుడిని సైబర్‌నేరగాళ్లు రెచ్చగొట్టారు. ముందుగా తమ వద్ద ఉన్న వీడియోలు, అప్లికేషన్ల సాయంతో నగ్న వీడియోలను ప్లే చేస్తూ బాధితుడిని బుట్టలో వేశారు. వాటితో బాధితుడిని రెచ్చగొట్టి అతడితో నగ్నంగా చాటింగ్‌ చేయించారు. ఆ చాటింగ్‌ను వీడియో రికార్డు చేసి.. బాధితుడిని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టారు. మేం అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించసాగారు.

ఇప్పటికే పలు దఫాలుగా 10 లక్షల వరకు వసూలు చేశారు. పరువు కోసం పాకులాడే వారినే వీరు లక్ష్యంగా చేసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారు. అయితే బాధితుడిని డబ్బుకోసం సదరు గ్యాంగ్ బెదిరించడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిలతో గాలం వేసి సైబర్ నేరగాళ్లు ఇలా నయా పద్దతుల్లో మోసాలు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

West Bengal Election 2021 Phase 1 Voting LIVE: పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన పోలింగ్‌.. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు

Assam Election 2021 Phase 1 Voting LIVE: మొదలైన అస్సాం తొలి దశ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాలకు జనాలు..