Hyderabad: గత సంవత్సరం మే నెలలో గచ్చిబౌలిలోని Zero-40 పబ్ నుంచి ఒక BMW X5 కార్‌ని ఓనర్‌గా బిల్డప్ ఇచ్చి వాలెట్ పార్కింగ్ నుంచి ఎత్తుకెళ్లాడు బైరెడ్డి అరుణ్ రెడ్డి అనే 29 ఏళ్ల యువకుడు. దీని మీద అప్పట్లో పోలీస్ కంప్లైంట్ కూడా అయింది. అయితే ఆ కార్‌కి ఒరిజినల్ నెంబర్ ప్లేట్ తీసేసి ఝార్ఖండ్ నెంబర్‌తో ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టడంతో కార్ ట్రేస్ చేయటం పోలీసులకు కష్టమైంది. ఆ కార్ చోరీలో దొరకలేదని సంబరపడిపోయిన అరుణ్ రెడ్డి.. జూన్ 24న రాత్రి మరో BMW కార్ దొంగిలించాడు. బౌల్టర్ హిల్స్‌లో జూన్ 24 రాత్రి బాద్షా మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్‌కి మనోగ్న అనే యువతి తన యెల్లో కలర్ స్పోర్ట్ మోడల్ bmw కార్‌లో వచ్చింది. అక్కడే ఉన్న అరుణ్ రెడ్డి.. వాలెట్ బాయ్‌లా మాట్లాడి పార్కింగ్ చేస్తానని నమ్మించి మనోగ్న నుంచి BMW కార్‌ను తీసుకెళ్లి పోయాడు. ఆ తరువాత కార్‌ని పక్కనే ఉన్న షెరటాన్ హోటల్ పార్కింగ్‌లో సేఫ్‌గా పెట్టి అక్కడ నుంచి తపించుకున్నాడు.
అయితే మనోగ్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు. ఆ క్రమంలోనే శుక్రవారం ఉదయం షేరటాన్ హోటల్ B2 పార్కింగ్ లాట్ నుంచి కార్ తీసుకెళ్లేందుకు వచ్చిన బైరెడ్డి అరుణ్ రెడ్డిని పట్టుకొన్నారు. అనంతరం అరుణ్ రెడ్డి నుంచి మనోగ్నకు చెందిన BMW 24, తన ఇంటి వద్ద ఉన్న BMW 5 కార్, ఇంకా అతని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. అనంతరం అతన్ని విచారించారు.
పోలీసుల చేపట్టిన విచారణలో నిందితుడు అరుణ్ రెడ్డి స్వస్థలం భద్రాచలం అని, ఇంటర్ వరకు చదివి హైదరాబాద్‌లో ఉంటూ వెబ్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. పెద్దగా చదువుకోకపోయినా పోష్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ట్రిమ్‌గా తయారయ్యి ఖరీదైన కార్‌లను కొట్టేసేవాడని వెల్లడైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..