Watch Video: ప్రేయసిని వదిలి ప్రియుడు పరారీ.. చలించిపోయిన మంచి దొంగలు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?

Funny Video: దొంగతనం, దోపిడి అనేవి ప్రస్తుత ప్రపంచంలో సర్వసాధారణం. ఇక రోడ్ మీద నడిచి వెళ్తున్నప్పుడు లేదా నిలుచుని ఉన్నప్పుడు మెడలోని గొలుసులను, చేతిలోని పర్సులను దౌర్జన్యంగా లేదా లాక్కొని వెళ్లడం అనేది కూడా శరామామూలైన విషయం. అయితే మనసు..

Watch Video: ప్రేయసిని వదిలి ప్రియుడు పరారీ.. చలించిపోయిన మంచి దొంగలు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?
Robbers' Viral Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 01, 2023 | 11:29 AM

Funny Video: దొంగతనం, దోపిడి అనేవి ప్రస్తుత ప్రపంచంలో సర్వసాధారణం. ఇక రోడ్ మీద నడిచి వెళ్తున్నప్పుడు లేదా నిలుచుని ఉన్నప్పుడు మెడలోని గొలుసులను, చేతిలోని పర్సులను దౌర్జన్యంగా లేదా లాక్కొని వెళ్లడం అనేది కూడా శరామామూలైన విషయం. అయితే మనసు మార్చుకున్న దొంగలను మీరు ఎప్పుడైనా చూశారా..? ఓ ప్రేమ జంట నుంచి దోపిడి చేద్దామని వచ్చి ఇద్దరు దొంగలు.. ప్రియుడి పిరికితనం చూసి మనసు మార్చుకున్నారు. అంతేకాక వారు లాక్కున్న హ్యాండ్ బాగ్‌ని కూడా సదరు ప్రియురాలికి ఇచ్చేశారు. ప్రస్తుతం దానిని సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో మీరు నడుచుకుంటూ వస్తున్న ఓ జంటను చూడవచ్చు. అంతలోనే అక్కడకు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మహిళ చేతిలోని హ్యాండ్‌బాగ్ ఇవ్వమని డిమాండ్ చేయడం.. ఇదిలా సాగుతుండగానే ఆ ప్రేమజంటలోని వ్యక్తి పరుగులు తీయడాన్ని కూడా మీరు గమనించవచ్చు. అయితే అలా అతను పరిగెత్తడం చూసిన సదరు దుండగుల మనసు చలించిపోయింది. వెంటనే తమ మనసును మార్చుకుని బ్యాగ్‌ని ఆ మహిళకు ఇచ్చేస్తారు. కేవలం 22 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా, వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతను ఆ మహిళకు సరైన జోడీ కాదని, పిరికివాడని, ఇలాంటివాళ్లతో ఉండే కన్నా సోలోగా ఉండడం చాలా మంచిదని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వీడియోలోని సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..