Congress Public Meeting in Hyderabad: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..
Congress Public rally in Thukkuguda Live Updates: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయభేరీ సభకు తెలంగాణ కాంగ్రెస్ భారీగా జన సమీకరణ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రకటించింది..

రెండు రోజులుగా హైదరాబాద్ తాజ్ కృష్ణా హోటల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC సమావేశం ముగిసింది. తెంలగాణ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ రెండు రోజుల సమావేశంలో లోతైన చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బంగారు తెలంగాణ ఆశలను BRS చిదిమేసిందని, ఆ ఆశలను తిరిగి జ్వలింపజేయాల్సిన అవసరం ఉందంటూ CWC తెలంగాణ ప్రజలకు ఒక విన్నపం చేసింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరింది.
తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును ప్రకటించారు సోనియాగాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీ పథకాలను వెల్లడించారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు 2500 రూపాయలు, 500లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు చెప్పారు. RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నామని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు సోనియాగాంధీ. రైతు భరోసా గ్యారెంటీని ప్రకటించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. రైతు భరోసా కింద 15వేలు పెట్టుబడి సాయం.. వ్యవసాయ కూలీలకు 12వేల సాయం అందిస్తామన్నారు. వరి పంటకు క్వింటాల్‌కు 500రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు ఖర్గే.
LIVE NEWS & UPDATES
-
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే
1. మహాలక్ష్మి స్కీమ్..
- మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 చెల్లింపు
- 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగానే ప్రయాణించవచ్చు
2. రైతు భరోసా స్కీమ్
- ప్రతీ సంవత్సరం భూమి ఉన్న రైతులకుతో పాటు సహా కౌలు రైతుకు రూ.15 వేలు
- వ్యవసాయ పనులు చేసే చిన్న, సన్నకారు కూలీలకు సంవత్సారానికి రూ.12 వేలు
- వరి పంటకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్
3. ఇందిరిమ్మ ఇళ్ల స్కీమ్
- ఇందిరిమ్మ పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో ఇవ్వడమే కాకు.. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
- తెలంగాణ కోసం పోరాటం చేసినవారికి 250 చదరపు గజాల ఇంటి స్థలం
4. గృహజ్యోతి పథకం స్కీమ్
- గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్
5. చేయూత స్కీమ్
- చేయూత స్కీమ్ కింద రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెస్స్
- చేయూత కింద ప్రతి నెలా రూ.4 వేల పెన్షన్
6. యువ వికాసం
- యువ వికాసం కింద స్టూడెంట్స్‌కు రూ.5లక్షల వరకు సాయం.
-
మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు : రాహుల్.
ధరణి పోర్టల్ పేరిట పేదల భూములను ప్రభుత్వం లాక్కొందన్నారు రాహుల్ గాంధీ. రైతుబంధు పేరిట భూస్వాములకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారని పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయటం లేదని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి 250 గజాల ఇంటిస్థలం ఇస్తామన్నారు. మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్‌ను రూ.వెయ్యి చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజు చెల్లిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్నారు. చేయూత కింద పింఛన్ నెలకు రూ.4000 చెల్లిస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మాట నిలబెట్టుకుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు నెరవేరుస్తుందన్నారు. మంత్రివర్గం ప్రమాణం చేసినరోజు నుంచే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు రాహుల్.
-
-
‘BRS, BJP, MIM పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే’
బీజేపీ, బీజేపీ, ఎంఐఎం పైకి విడిగా కనిపిస్తున్నా.. అంతా ఒక్కటే అన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంటులో కేంద్రం పెట్టిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. పార్లమెంటులో బీజేపీ ఏం చెబితే దానికి BRS, ఎంఐఎం మద్దతిస్తాయన్నారు. మోదీ కనుసైగ చేయగానే BRS, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయన్నారు.
-
తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 చరిత్రాత్మకమైన రోజు: ఖర్గే
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రకటిస్తోందని తెలిపారు. రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15000 వేలు ఇస్తామన్నారు. పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. వరి పంటకు క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామన్నారు ఖర్గే.పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టం తెచ్చింది కాంగ్రెస్ అన్నారు ఖర్గే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు. సోనియాగాంధీ ఓట్ల కోసం తెలంగాణ ఇవ్వలేదని.. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.
-
6 గ్యారెంటీలు ప్రకటించిన సోనియా గాంధీ
తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ సోనియాగాంధీ స్పీచ్ స్టార్ట్ చేశారు.చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు కొన్ని పథకాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి నెరవేర్చేలా 6 గ్యారంటీలను ప్రకటిస్తున్నానని తెలిపారు సోనియా. తెలంగాణ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే మహాలక్ష్మి పథకం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మహిళలకు రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు సోనియా.
-
-
సోనియా గాంధీ స్పీచ్ లైవ్ దిగువన చూడండి
-
దేశం కోసం నెహ్రూ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది: అశోక్ గెహ్లోట్
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని అశోక్ గెహ్లోట్ పేర్కొన్నారు. సోనియాగాంధీ తన కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. రెండుసార్లు అవకాశం వచ్చినా రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయలేదని పేర్కొన్నారు. దేశం కోసం అనుభవజ్ఞులైన మన్మోహన్‌సింగ్‌నే ప్రధానిగా చేశారని గుర్తు చేశారు.
-
సభా వేదికకు చేరుకున్న నేతలు
తుక్కగూడ సభావేదిక వద్దకు సోనియా, రాహుల్, ఖర్గే సహా నేతలంతా చేరుకున్నారు. అనంతరం ప్రజలకు అభివాదం చేశారు. కొండా సురేఖ.. సోనియాకు శాలువా కప్పారు. అనంతరం ఆమెకు కాంగ్రెస్ బ్యాడ్జ్ పెట్టారు. దాదాపు 10 లక్షల మందిని ఈ సభకు తరలించింది కాంగ్రెస్. నేతలు రాగానే కాంగ్రేస్ శ్రేణులు కేకలు, చప్పట్లతో సాదర స్వాగతం పలికారు.
-
సభావేదికకు చేరుకున్న డీకే
విజయభేరీ సభా ప్రాంగణం నుంచి ఎన్నికల సమరశంఖం పూరించనుంది కాంగ్రెస్. ఇక్కడే 6 గ్యారంటీ స్కీములను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు. ఇప్పుడే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సభావేదిక వద్దకు చేరుకున్నారు.
-
కాంగ్రెస్ సభకు పోటెత్తిన జనం
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ విజయభేరి సభ భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఫోర్ వీలర్లు, ఆర్టీసీ బస్సులతో పాటు, డీసీఎం వాహనాలు, బైక్‌లపై కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వందలాది వాహనాలు తుక్కుగూడ సభకు చేరుకునే క్రమంలో పలు ప్రధాన రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
-
బీఆర్ఎస్ ఓటమి పక్కా: ఉత్తమ్
BRS ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ఓటర్లు నిర్ణయించుకున్నారని నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. CWC సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రంలోనూ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధాని బాధ్యతలు చేపడతారని తెలిపారు.
-
కాంగ్రెస్ విజయభేరి సభ లైవ్ అప్‌డేట్స్ దిగువన వీడియోలో చూడండి
కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విజయ భేరి సభను ఇక్కడ లైవ్ చూడండి. ఖర్గే, సోనియా, రాహుల్‌తో పాటు రాష్ట్ర నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
-
ఢిల్లీ వెళ్లిపోయిన ప్రియాంక
తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. నాలుగు రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్స్, సీఎల్పీ లీడర్స్, తెలంగాణకు చెందిన సీనియర్ లీడర్స్, పలు అనుబంధ సంఘాల నాయకులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. భవిష్యత్ కార్యచరణపై అగ్ర నేతలు కీలక సూచనలు చేశారు. పలువురు సీనియర్ నేతల నుంచి హైకమాండ్ సూచనలు తీసుకుంది. అయితే తుక్కుగూడ సభకు ప్రియాంకాగాంధీ గైర్హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది. CWC సమావేశాలు ముగియగానే ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయారు.
Published On - Sep 17,2023 4:29 PM




