AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ అడ్డాగా పోలీసుల ప్రీ వెడ్‌ షూట్‌..నెటిజన్ల రియాక్షన్‌..! స్పందించిన సీపీ..?

మ్యారేజ్ కంటే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు ఈ జంట. పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ వాహనం తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు ఇరకాటంలో పడినట్టయింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సదురు ఎస్సై లు భావన, కిషోర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. దీంతో విషయం పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ వెడ్డింగ్ షూట్ పై పోలీస్ అధికారులు

Watch Viral Video: పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ అడ్డాగా పోలీసుల ప్రీ వెడ్‌ షూట్‌..నెటిజన్ల రియాక్షన్‌..! స్పందించిన సీపీ..?
Pre Wedding Shoot
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2023 | 8:17 PM

Share

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారుల ప్రీ-వెడ్డింగ్ షూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ప్రతి ఒక్కరూ స్పందించారు. ఈ ఆకర్షణీయమైన వీడియో ఎంతో నైపుణ్యంతో తీశారు. ఇందులో స్లో-మోషన్ షాట్‌లు, డ్యాన్స్ సీక్వెన్స్‌లు వీక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఈ జంట టాలీవుడ్ సినిమాల్లోని సన్నివేశాలతో అదిరిపోయే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేశారు. ఈ పోలీసు జంట తమ పోలీసు వాహనాల నుండి సొంపుగా దిగడంతో వీడియో ప్రారంభమవుతుంది.

ఇంకా, ఈ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం హైదరాబాద్‌లోని చార్మినార్, లాడ్ బజార్‌తో సహా ఐకానిక్ ప్రదేశాలకు తీసుకువెళ్లింది. ఈ వీడియోకి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా మరింత అందంగా జత చేశారు. ఆగస్టు 26న భావన కిషోర్ల వివాహం జరిగింది. కాగా, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వీడియో తెగ సందడి చేస్తోంది. వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆగస్టు 26న భావన కిషోర్ల వివాహం జరిగింది. కాగా, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒక వినియోగదారు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌ను కామెంట్‌లో ట్యాగ్ చేస్తూ, “సార్, ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు పోలీస్ స్టేషన్‌లను ఉపయోగించడం అనుమతించబడుతుందా? అని ప్రశ్నించారు. మరో వైపు ఈ జంటకు విషేస్ చెబుతూ..వారి వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. మరో వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, “ఇది అద్భుతంగా ఉంది! నూతన వధూవరులకు అభినందనలు. నేను ఎప్పుడూ సినిమాల్లో పోలీసులను చూస్తాను, కానీ నేను పోలీసులతో కూడిన సినిమాను చూడటం ఇదే మొదటిసారి.” అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కు అడ్డాగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ తో భావన లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ కంటే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు ఈ జంట. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే పోలీస్ వాహనం తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. దీంతో ఈ ఇద్దరు ఇప్పుడు ఇరకాటంలో పడినట్టయింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సదురు ఎస్సై లు భావన, కిషోర్‌పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు మండిపడుతున్నారు. దీంతో విషయం పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ వెడ్డింగ్ షూట్ పై పోలీస్ అధికారులు తగు చర్యలు తీసుకున్నట్టుగా తెలిసింది.  ఇదిలా ఉంటే, దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్ అంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు అవార్డు దక్కింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..