CJI NV Ramana: చేతికి ఎముక లేనితనానికి ఆయనే ట్రేడ్ మార్క్.. సీఎం కేసీఆర్‌పై సీజేఐ ప్రశంసలు
పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలా చూడానికి చూస్తున్నామని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
CJI NV Ramana: పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేలా చూడానికి చూస్తున్నామని అన్నారు సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana). హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో(Telangana Judicial Officers) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. అందుకోసం న్యాయశాఖకు కావాల్సిన సదుపాయాలపైన భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలిపారు. భారత ప్రభుత్వంతో న్యాయమూర్తుల నియామకాలు, కోర్ట్ సిబ్బంది ఖాళీల అంశాలపై చర్చిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు హైకోర్టు లో 24 మంది న్యాయమురుల నుంచి 42 వరకు నియమించాం.. కోవిడ్ సమయం లో న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారని మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయశాఖకు కురిపించిన వరాల జల్లుకు కృతజ్ఞతలంటూ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని.. తెలంగాణలో కేసీఆర్ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్ మార్క్‌గా సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసించారు జస్టిస్ ఎన్వీ రమణ.
న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందన్నారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోందని వెల్లడించారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లుగా తెలిపారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్ వద్ద రేంజ్ రోవర్ కారులో మంటలు..