AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వ్యవసాయానికి విద్యుత్ ఏడు గంటలు మాత్రమే.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వ్యవసాయానికి తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటలకు కుదించింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ...

Telangana: వ్యవసాయానికి విద్యుత్ ఏడు గంటలు మాత్రమే.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Power Cut
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 15, 2022 | 1:27 PM

Share

వ్యవసాయానికి తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాను ఏడు గంటలకు కుదించింది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSNPDCL ) రాతపూర్వక ఆదేశాలిచ్చింది. జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని స్ఫష్టం చేసింది. రాష్ట్రంలో నెలరోజులుగా వెయ్యి నుంచి 1,500 మెగావాట్ల వరకు విద్యుత్‌ కొరత ఉంటోంది. గత నెలలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనట్టుగా 14,200 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. యాసంగి పంటలు కోతకు రావడంతో రోజువారీ డిమాండ్‌ 12,500 మెగావాట్లకు తగ్గింది. అయినప్పటికీ కొరత ఏర్పడడంతో మూడు రోజులుగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను 7 గంటలకు కుదించినట్టు అధికారులు వెల్లడించారు. ఎండలు తీవ్రం కావడంతో మార్చి చివరి వారం నుంచి దేశ వ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది.

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్ల అమ్మోనియం నైట్రేట్‌ కొరత ఏర్పడింది. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి తగ్గింది. విద్యుత్‌ కొరతను తీర్చుకోవడానికి రాష్ట్రాలు పవర్‌ ఎక్సే్ఛేంజీని ఆశ్రయించడంతో ధరలు యూనిట్‌కు రూ.20 వరకు పెరిగాయి. ఈ క్రమంలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రంగంలో దిగి యూనిట్‌ రేటు రూ.12కు మించకుండా నియంత్రణ విధించింది. పవర్‌ ఎక్సే్ఛేంజీ నుంచి గత నెలలో రాష్ట్రం రూ.1,800 కోట్ల విద్యుత్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రోజుకు రూ.30కోట్ల నుం చి రూ.40కోట్ల మేర విద్యుత్‌ కొంటోంది. యాసంగిలో బోర్లు, బావుల కింద ఆలస్యంగా వేసిన పంటలు ఇంకా పంట ఉత్పత్తి దశకు రాలేదు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను అకస్మాత్తుగా 7 గంటలకు తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Also  Read

IPL 2022: హార్దిక్ పాండ్యాకు లక్ష రూపాయల నష్టం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

Watch Video: ప్లీజ్.. మీ కాళ్లు మొక్కనివ్వండన్న జాంటీ రోడ్స్.. వద్దని వారించిన సచిన్.. వైరల్ వీడియో