Hyderabad: సరదా కోసం సైకిల్ తొక్కితే ప్రాణం పోయింది.. విషాదం నింపిన ఘటన
సైకిల్ తొక్కుతూ కిందపడిన బాలిక మృతిచెందిన విషాదకర ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్, స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని మల్లంపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్.. నిజాంపేట కార్పొరేషన్‌లో....
సైకిల్ తొక్కుతూ కిందపడిన బాలిక మృతిచెందిన విషాదకర ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్, స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని మల్లంపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్.. నిజాంపేట కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతని కుమార్తె చైతన్య స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. బుధవారం సైకిల్ తొక్కుకునేందుకు బయటకు వెళ్లింది. రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కింద పడింది. అక్కడ ఉన్న వాళ్లు పైకి లేపేలేపే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో సమీపంలోని మరో ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చేర్చే ముందే బాలిక మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సైకిల్ హ్యాండిల్ కడుపులో బలంగా తగలడంతో బాలిక అపస్మారకస్థితికి వెళ్లి చనిపోయిందని వైద్యులు తెలిపారు.
ఏడాది క్రితం బాలిక తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడటంతో రెండు నెలల పాటు కోమాలో ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాలిక తల్లి సుమలతకు రెండుసార్లు బ్రెయిన్ ఆపరేషన్ చేయించారు. ఈ సమయంలోనే వారి కుమార్తె ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
Also Read
suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..
Simbu: ఆటో డ్రైవర్గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..
PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు..