Weather: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఊరట కలగనుంది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఊరట కలగనుంది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాతావరణం(Weather) ఆకాశం మేఘాలతో నిండి ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ విదర్భ నుంచి మరాట్వాడా మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని.. సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తున ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 18 వరకూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 15న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురవనుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మిగతా జిల్లాలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండ వేడిమి, ఉక్కపోతతో బాధపడుతున్న జనాలకు వర్ష సూచన చల్లని కబురే అయినప్పటికీ రైతులకు మాత్రం ఈ వర్షాలతో నష్టాలు తప్పవు. పంటలు చేతికొచ్చే సమయంలో కురిసే ఈ వర్షాలను చెడగొట్టు వానలని కూడా పిలుస్తారు. వర్ష సూచన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Owaisi Convoy: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం.. కాన్వాయ్‌ని అడ్డుకున్న ఆందోళనకారులు
China: అల్లాడిపోతున్న చైనా.. ఆదుకోవాలంటూ అరుపులు, కేకలతో జనం హాహాకారాలు..!