చీటింగ్ కేసుః హైదరాబాద్‌లో ప్రముఖ వ్యక్తి ఇంటిపై పోలీసుల దాడులు

ముసద్దీలాల్‌ జ్యువెల్లరీస్‌ అధినేత, ప్రముఖ వ్యాపారి సుకేశ్ గుప్తా కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని బీఎన్‌రెడ్డి కాలనీలో ఓ ప్రముఖ వ్యక్తి నివాసంలో

చీటింగ్ కేసుః హైదరాబాద్‌లో ప్రముఖ వ్యక్తి ఇంటిపై పోలీసుల దాడులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 9:55 AM

ముసద్దీలాల్‌ జ్యువెల్లరీస్‌ అధినేత, ప్రముఖ వ్యాపారి సుకేశ్ గుప్తా కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని బీఎన్‌రెడ్డి కాలనీలో ఓ ప్రముఖ వ్యక్తి నివాసంలో ఆయన తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో వారు ఆ వ్యక్తి ఇంట్లో దాడులు జరిపారు. కానీ తనిఖీల తరువాత ఆయన అక్కడ లేనట్లు పోలీసులు తెలిపారు. కాగా బషీర్‌బాగ్‌ కేంద్రంగా పనిచేసే ఆశీ రియల్టర్‌కు చెందిన సుకేశ్‌గుప్తా, నీతూగుప్తా, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సురేశ్‌కుమార్, రవిచంద్రన్‌లు ఎస్‌ఆర్‌ఈఐ వద్ద రూ.110 కోట్ల రుణం కోసం 2018 జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఏడాది అక్టోబర్‌ నుంచి ప్రతి 3 నెలలకు ఓ వాయిదా చొప్పున చెల్లిస్తూ మొత్తం 4 దఫాల్లో రుణం వడ్డీ సహా తీర్చాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ రుణానికి సంబంధించి షూరిటీగా హఫీజ్‌పేటలో ఉన్న 8 ఎకరాల స్థలంతో పాటు, కింగ్‌కోఠిలో 28,106 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను చూపించారు. కానీ ఆ రుణం చెల్లించడంలో వారు విఫలం కావడంతో గతేడాది డిసెంబర్‌లో హఫీజ్‌పేటలోని స్థలాన్ని వేలం వేసిన ఎస్‌ఆర్‌ఈఐ సంస్థ 102.6 కోట్లు రాబట్టుకుంది. మిగిలిన మొత్తం రికవరీ కోసం నజ్రీబాగ్‌ ప్యాలెస్‌ను వేలం వేయాలనుకుంది. అయితే ఆ లోపే ఆ ప్యాలెస్‌ను వారు ఐరిస్‌ హాస్పిటాలిటీస్‌కు విక్రయించినట్లు ఎస్‌ఆర్ఈఐ గుర్తించింది. దీంతో ఎస్‌ఆర్‌ఈఐ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అసోసియేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుకేశ్‌ గుప్తా, నీతూ గుప్తా, రవీంద్రన్, సురేశ్‌కుమార్‌లపై ఛీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి.. సోదాలు నిర్వహించారు.

Read This Story Also: కరోనా పరీక్షా సెంటర్ల సంఖ్య పెంపు.. ప్రైవేట్ కంపెనీలకు అనుమతి

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..