Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ ఆఫర్ .. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకొస్తే.. !
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సామరస్యంగా జలవివాదాన్ని పరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు
Krishna Water Dispute: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సామరస్యంగా జలవివాదాన్ని పరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రులు, కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కిషన్ రెడ్డి ఇద్దరు సీఎం లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన కిషన్ రెడ్డి.. వివాద పరిష్కారం కోసమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సామరస్యంగా జలవివాదాన్ని పరిష్కరించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
కృష్ణా జలాల నీటి వినియోగం మీద జూలై 15వ తేదీన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా డైరెక్షన్ ఇచ్చింది. కొంత కాలంగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదానికి చరమగీతం అన్నట్టుగా ఒక్కో రాష్ట్రానికి నీటి వాటా ఎంత? వినియోగించాల్సింది ఎంత? అనే దానిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం. కృష్ణా, గోదావరి నదుల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేసింది కేంద్ర జల శక్తి శాఖ. అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
అంతేకాదు, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలో చేర్చింది కేంద్ర జలశక్తి శాఖ. కృష్ణా, గోదావరి నదీ యజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా బోర్డుల పరిధిలోకి కృష్ణానదిపై ఉన్న 36, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులు వస్తాయి.
అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి. అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి రానున్నాయి. ఇక, ఒక్కో రాష్ట్రం బోర్డుకు 200 కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలి. సీడ్ మనీ కింద ఈ మొత్తాన్ని 60 రోజుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లో చెల్లించాలని కేంద్రం తన గెజిట్ నోటిఫికేషన్‌లో సూచించింది.