AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రత్యూషది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు.. సూసైడ్ నోట్ లభ్యం.. ఏమి రాసుందంటే..?

ఫ్యాషన్‌ ప్రపంచంలో ఒక తార నేలరాలింది. తాను డిజైన్‌ చేసిన దుస్తులతో ఎంతో మందికి కొత్త అందాన్ని ఇచ్చిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు.

Hyderabad: ప్రత్యూషది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు.. సూసైడ్ నోట్ లభ్యం.. ఏమి రాసుందంటే..?
Fashion Designer Prathyusha(File Photo)
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2022 | 9:05 PM

Share

Fashion Designer Prathyusha Death: ఫ్యాషన్‌ ప్రపంచంలో తిరుగులేని పేరు సంపాదించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్‌ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన బొటిక్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ప్రత్యూష రాసిన సూసూడ్ నోట్ బయటకు వచ్చింది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని, తల్లిదండ్రులకు భారంగా ఉండదలుచుకోలేదని ఆమె సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇంకా ఎన్నాళ్లు తల్లిదండ్రులపై ఆధారపడి బ్రతకాలంటూ తన ఆవేదనను ఆ లెటర్‌లో రాసుకొచ్చింది. తనను క్షమించాలని పేర్కొంది.  డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చాలాసార్లు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ లోని సొంత ఇంటి నుండి బోటిక్‌కు వచ్చిన ప్రత్యుష.. ఓ బ్యాగ్‌తో లోపలికి వెళ్లింది. శనివారం ఉదయం వాచ్‌మెన్‌ వద్దకు వచ్చి తనను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది. ఆపై అత్యంత విషపూరితమైన కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చార్‌కోల్‌ గ్రిల్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ పోసి ఆ పొగ పీల్చి ఆమె చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె గది నుంచి పోలీసులు కార్బన్‌ మోనాక్సైడ్‌ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అపోలో ఆస్పత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యింది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.

ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులకు ప్రత్యూష కస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌ చేశారు. జాక్వెలిన్, మాధురి దీక్షిత్, దీపికా పదుకోన్‌, పరిణీతి చోప్రా, విద్యాబాలన్‌, శృతి హాసన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రణీత, ఛార్మి, రామ్‌చరణ్‌, ఉపాసన వంటి ప్రముఖ సినీతారలు, ప్రముఖులకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారు. అనేక మంది సెలబ్రిటీలు ప్రత్యూష వర్క్స్‌ను ఎండార్స్ చేశారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ఆల్‌ మోస్ట్‌ హీరోయిన్లందరికీ ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. బాలీవుడ్‌ తారలు అనేక మంది ప్రత్యూషకు ఫ్యాన్స్‌గా ఉన్నారు. కొంత మంది హీరోలకు కూడా ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు.