Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం.. బెదిరింపు కాల్ రావడంతో రంగంలోకి దిగిన అధికారులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఎవరో బెదిరింపు కాల్ చేశారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెదిరింపు కాల్ రావడంతో రైల్వే రక్షక దళ, జీఆర్‌పీ పోలీసులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ ఎవరో బెదిరింపు కాల్ చేశారు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెదిరింపు కాల్ రావడంతో రైల్వే రక్షక దళ, జీఆర్‌పీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్లో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించిన అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఆకతాయిల వ్యవహారంగా పోలీసులు భావిస్తున్నారు. ట్రైన్‌లో బాంబు ఉందని తెలియడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాంబు లేదని తేలడంతో బళ్లారి ఎక్స్‌ప్రెస్ బయలు దేరింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..