Hyderabad: సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులు.. అనుమానం వచ్చిన అధికారులు చెక్ చేయగా.. కళ్లు జిగేల్..
అధికారులు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కుల దందాలు మాత్రం ఆగడం లేదు. అధికారులకు టోకరా కొడుతూ యథేశ్చగా స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో..
అధికారులు, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా అక్రమార్కుల దందాలు మాత్రం ఆగడం లేదు. అధికారులకు టోకరా కొడుతూ యథేశ్చగా స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేతకు సంబంధించిన వార్తలు చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా సూడాన్ నుంచి హైదరాబాద్‌కు 23 మంది ప్రయాణికులు వచ్చారు. అయితే వీరు తీరు అనుమానంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. వీరిలో నలుగురి షూ, దుస్తుల మధ్యలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులకు కళ్లు జిగేల్‌మనే దృశ్యం కనిపించింది.
తనిఖీల్లో 14 కేజీల బంగారాన్ని గుర్తించారు. ఈ బంగారం విలువ అక్షరాల రూ. 7.8 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.
మరిన్ని హైదరబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..