Watch Video: అప్పటి వరకు పెళ్లి జోష్‌లో సందడిగా.. అంతలోనే అనంతలోకాలు. అసలేం జరిగింది.?
అప్పటివరకు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదలడం. ఇటీవల ఇలాంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు మనుషులకు ఏమవుతోంది అన్న ప్రశ్నలకు తలెత్తమానవు. స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి...

అప్పటివరకు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు వదలడం. ఇటీవల ఇలాంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే అసలు మనుషులకు ఏమవుతోంది అన్న ప్రశ్నలకు తలెత్తమానవు. స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కుప్పకూలిపోతున్నారు. ఆటలాడుతూ, మాట్లాడుతూ కూడా ఉన్నచోటే కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. వీటన్నింటికీ ఒకే ఒక కారణం హార్ట్ ఎటాక్. ఒకప్పుడు హార్ట్ ఎటాక్ వస్తే కనీసం ప్రాణాలు దక్కేవి. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కాల పత్తర్‌లో నివాసముండే మహమ్మద్ రబ్బాని అదే ప్రాంతంలో బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో బంధువులంతా ఉత్సాహంగా పెళ్లి వేడుకలలో పాల్గొని పెళ్లి కొడుకును ముస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన హల్దీ వేడుకల్లో పాల్గొన్నాడు రబ్బాని. ఇదిలా ఉంటే రబ్బాని చూస్తుంటే అతని వయసు 40 ఏళ్ల లోపు ఉండొచ్చని తెలుస్తోంది.
పెళ్లి కొడుకు ముందు కూర్చొని పసుపు రాశాడు. పెళ్లి కొడుకుతో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రబ్బాని ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే ఇదంతా అక్కడే ఉన్న వారు ఫోన్‌లో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..
