AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: షేక్‌పేట కొత్త ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. బైకర్‌ను ఢీకొట్టిన కారు.. పైనుంచి పడి..

Road Accident at Shaikpet new Flyover: హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన షేక్‌పేట కొత్త ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్

Hyderabad: షేక్‌పేట కొత్త ఫ్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం.. బైకర్‌ను ఢీకొట్టిన కారు.. పైనుంచి పడి..
Shaikpet Flyover
Shaik Madar Saheb
|

Updated on: Feb 05, 2022 | 10:35 AM

Share

Road Accident at Shaikpet new Flyover: హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన షేక్‌పేట కొత్త ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ (Shaikpet flyover) పై వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ఫ్లై ఓవర్‌పై నుంచి ఎగిరి కిందపడిన యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు బైకర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు బ్రిడ్జిపై నుంచి పడిపోయాడు. తీవ్రగాయాలపై అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు (Hyderabad) పోలీసులు తెలిపారు. దీంతో ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Andhra Pradesh: ప్రేమించి పెళ్లి.. ఎనిమిదేళ్లు అన్యోన్యంగా కాపురం.. భార్య ఆచూకి మిస్సింగ్.. అసలు కోణం ఇది

Srinagar Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Follow Us