AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. సభ సాక్షిగా.. ఆట మొదలైంది..!

తెలంగాణలో సరికొత్త రగడ రాజుకుంది... ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్‌ భగ్గుమంటోంది. నిర్బంధ పాలన నుంచి విముక్తి వచ్చినట్టు ప్రసంగంలో పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మాజీ మంత్రులు. ప్రభుత్వ పాలసీలపైనా, 6 గ్యారెంటీలపైనా స్పష్టత లేదన్న బీఆర్ఎస్‌.. కాంగ్రెస్‌ మేనిఫోస్టో మాత్రమే గవర్నర్‌ చదివారన్నారు కడియం శ్రీహరి.

Telangana: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. సభ సాక్షిగా.. ఆట మొదలైంది..!
Telangana Government
Ravi Kiran
|

Updated on: Dec 15, 2023 | 6:47 PM

Share

తెలంగాణలో సరికొత్త రగడ రాజుకుంది… ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్‌ భగ్గుమంటోంది. నిర్బంధ పాలన నుంచి విముక్తి వచ్చినట్టు ప్రసంగంలో పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు మాజీ మంత్రులు. ప్రభుత్వ పాలసీలపైనా, 6 గ్యారెంటీలపైనా స్పష్టత లేదన్న బీఆర్ఎస్‌.. కాంగ్రెస్‌ మేనిఫోస్టో మాత్రమే గవర్నర్‌ చదివారన్నారు కడియం శ్రీహరి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై కీలక ప్రసంగం చేశారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు గవర్నర్. పౌరహక్కులు, ప్రజాహక్కులకు నాంది పలికిందన్నారు కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తొందర్లోనే అమలు చేస్తామన్నారు. పాలకులు ప్రజలకు సేవకులే తప్ప.. పెత్తందార్లు కాదన్న గవర్నర్‌.. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ ఆవిర్భవించదని గుర్తు చేశారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. అది గవర్నర్ ప్రసంగంలా లేదని కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లుగా ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విస్మరించారన్నారు. పైగా ప్రభుత్వం పాలసీల గురించి ప్రసంగంలో లేదున్నారు మాజీ మంత్రులు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకుని తెలంగాణ ప్రజలు 2014 నుంచే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రివ్యూలు చేస్తూ గత ప్రభుత్వంపై మంత్రులు విమర్శలు చేస్తుంటే… అటు మీ ఆరు గ్యారెంటీల సంగతేంటని బీఆర్ఎస్‌ ప్రశ్నిస్తోంది. పథకాల వార్‌ నడుస్తుండగానే తాజాగా గవర్నర్‌ ప్రసంగం వేదికగా మరో యుద్ధానికి తెరలేచింది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్