Covaxin: కోవాగ్జిన్‌ టీకాపై గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్… కొత్త వేరియంట్లపై..?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఠారెత్తిస్తోంది. ఫస్ట్‌వేవ్‌ని మించి సెకండ్‌ వేవ్‌ హోరెత్తిపోతోంది... ఏ నగరంలో చూసినా కరోనా బాధితులే...

Covaxin: కోవాగ్జిన్‌ టీకాపై గుడ్‌న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్... కొత్త వేరియంట్లపై..?
Covaxin
Follow us

|

Updated on: Apr 22, 2021 | 2:35 PM

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఠారెత్తిస్తోంది. ఫస్ట్‌వేవ్‌ని మించి సెకండ్‌ వేవ్‌ హోరెత్తిపోతోంది. ఏ నగరంలో చూసినా కరోనా బాధితులే. ఏ పెద్దాసుపత్రిలో చూసినా కరోనా పేషెంట్లే. ఊపిరి నిలుపుకోవడానికి పోరాటం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో కరోనాను కట్టడి చేయాలంటే- వ్యాక్సిన్లు అనే రక్షణ కవచాలు అత్యవసరం. అందుకే మే ఒకటి నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు తగినట్లే ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో పూణెలో కేంద్రంగా కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ టీకా ధరలను ఖరారు చేసింది. కోవిషీల్డ్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 400 డోసు చొప్పున విక్రయిస్తారు. అలాగే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌కు డోసు రూ. 600గా ఖరారు చేశారు. దేశంలో బ్లాక్‌మార్కెట్‌ బెడద లేకుండా, వేలకు వేలు ఎవరూ అమ్ముకోకుండా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ముందుగానే ఈ ప్రకటన చేసింది. తద్వారా తక్కువ ధరల్లో సామాన్యులు సైతం టీకాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటికే లభిస్తున్న టీకాలకు 150 నుంచి 250 రూపాయల దాకా ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి. ధరల్లో ఈ వ్యత్యాసాన్ని అరికట్టడానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ముందస్తుగానే ఈ ధరల వివరాలను ప్రకటించింది. విదేశీ టీకాలతో పోల్చితే కోవిషీల్డ్‌ ధర చాలా తక్కువని ఈ సంస్థ చెబుతోంది. వాటి వివరాలను కూడా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ఇది ఇలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్‌ టీకాపై కూడా గుడ్‌న్యూస్‌ వచ్చింది. కోవిడ్‌ కొత్త వేరియెంట్లను ఎదుర్కోవడంలో కోవాగ్జిన్‌ సక్సెస్‌ అయింది. దానికి సంబంధించిన అధ్యయన ఫలితాలను ICMR- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంయుక్తంగా వెల్లడించాయి. యూకే వేరియెంట్‌ అయిన B.1.1.7, బ్రెజిల్‌ వేరియెంట్‌ అయిన B.1.1.28, దక్షిణాఫ్రికా వేరియెంట్‌ అయిన B.1.351, భారత్‌లో కనిపిస్తున్న B.1.617 వేరియెంట్‌తో కోవాగ్జిన్‌ సమర్థంగా పోరాడుతోంది. అన్ని కొత్త వేరియెంట్స్‌ను కోవాగ్జిన్‌ ఎదుర్కొంటోందని ICMR చెప్పడం కోట్లాదిమందికి ఊరటనిస్తోంది. మొత్తం మీద ఆక్సిజన్‌ నిల్వలు జనాన్ని ఇంకా భయపెడుతుంటే- మన వ్యాక్సిన్లు భరోసా ఇస్తున్నాయి. అదే సందర్భంలో బహిరంగ మార్కెట్‌లోకి కోవిషీల్డ్‌ వస్తుండటం, కోవాగ్జిన్‌ గురించి కూడా గుడ్‌న్యూస్‌ రావడం కొసమెరుపు.

Read also:

Scary Video: ఆకలి మీదున్న సింహాలు.. మాటు వేసిన మొసళ్లు.. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు.!

అయ్యోపాపం.. నీళ్లు కోసం వచ్చి కుక్క.. ఎరుక్కపోయి… ఇరుక్కుపోయింది.!

Viral: ఒకేసారి 16 మంది అబ్బాయిలతో డేటింగ్.. అమ్మాయి రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే.!

ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా